హర్యానాలో దారుణం – ఒక మహిళపై 40 మంది

ప్రతీ రోజూ ఎక్కడ చూసినా సరే ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల వార్తలే వినిపిస్తున్నాయి.రోజు కి ఎక్కడో ఒక చోట మహిళలు చిన్న చిన్న బాలికలు ,చివరికి వృద్ద మహిళలపై కూడా అత్యాచారాలకి తెగబడుతున్నారు మృగాలు అత్యాచారాలకి తగినట్టుగా శిక్షలు ఉండక పోవడం వలనో లేక చట్టంలో లొసుగులు ద్వారా తప్పించుకోవడమో జరుగుతోంది.

 A Woman Gang Raped By 40 Mens In Haryana1-TeluguStop.com

అయితే మొన్న నిర్భయ కేసులో నలుగురు కామాంధులకు ఉరి శిక్ష పడినా కొంత మంది కామాంధులకు భయం కలగడం లేదు.

తమిళనాడులో ఓ చిన్నారిపై తమిళనాడులో ఓ చిన్నారిపై 24 మంది ఏడు నెలల పాటు దారుణంగా అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే తమిళనాడు తరహా ఘటన ఈ సారి హర్యానా రాష్ట్రంలో జరిగింది హర్యానాలో ఓ మహిళని నలభై మంది అత్యంత అమానుషంగా దారుణంగా అత్యాచారం చేశారు.ఒక మహిళపై దాదాపు 40 మంది అత్యాచారం చేశారు అంటే సమాజం మొత్తం నిర్ఘాంతపోయే ఘటన ఇది ఎవరూ కూడా నమ్మలేని సంఘటన అది.వివరాల్లోకి వెళితే.

ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళని నమ్మించి హర్యానాలోని పంచకులలో ఓ గెస్ట్ హౌస్ లో ఆమెని భంధించి నాలుగురోజుల పాటు అతి కిరాతకంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.అయితే ఉద్యోగానికి వెళ్లిన ఆ మహిళ నాలుగు రోజులైనా రాకపోవడంతో గురువారం చంఢీగర్ పోలీసులకు ఫిర్యాదు అందటంతో రంగంలోకి దిగిన పోలీసులు సీరియస్ గా దర్యాప్తు ప్రారంభించారు.

అంతేకాదు ఆ మహిళ వెళ్లిన గెస్ట్ హౌజ్ గుర్తించారు.వెంటనే అక్కడికి వెళ్లి ఆమెను రక్షించారు…తరువాత ఆ మహిళా తెలిపిన వివరాలు విని పోలీసులు షాక్ కి గురయ్యారు.

తనకు ఉద్యోగమిస్తానని తన భర్తకు చెప్పిన వ్యక్తే జూలై 15వ తేదీనాడు తనను గెస్ట్ హౌజ్ లో బంధించి తనతో పాటు 39 మందితో అత్యాచారం చేయించాడని పోలీసులకి తెలిపింది కేసుని నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube