అమెరికా ఆర్ధిక దీన స్థితికి ఇదో ఉదాహరణ..!!

ప్రస్తుతం అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే.కరోనా ముందు అమెరికా, కరోనా తరువాత అమెరికా అనే బేరీజులు వేసుకుంటున్నారు.

 Corona Effect On American Hotels, American Hotels Closed, American Congress, Sal-TeluguStop.com

కరోనా ముందు ఆర్ధిక పరిస్థితులు, తరువాత ఆర్ధిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.మహమ్మారి పంజా విసిరిన తరువాత ఒక్క సారిగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయ్యిపోయింది.

ఫ్యాక్టరీలు, కంపెనీలు, పలు రకాల వ్యాపార సంస్థలు నెలలకు పైగా తెరుచుకోక పోవడంతో ఎంతో మంది ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు.అన్ని దేశాలతో పోల్చితే కరోనా ప్రభావం ఎక్కువగా అమెరికాపై ప్రభావం చూపడంతో ఆ స్థాయిలోనే ఆర్ధిక ప్రభావం కూడా చూపించింది.

ఇదిలాఉంటే


అమెరికా వ్యాప్తంగా కరోనా కారణంగా కంపెనీలు, వ్యాపార సంస్థలు కంటే కూడా అత్యధికంగా నష్టపోయింది హోటల్స్ మాత్రమేనని తెలుస్తోంది. ఫైవ్ స్టార్ హోటల్స్ మొదలు, దాదాపు అన్ని హోటల్స్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది.

ఆర్ధిక భారంతో జీతాలు చెల్లించలేక చతికలపడి చివరికి మూతబడిన హోటల్స్ లెక్కకు మించే ఉన్నాయట.ప్రస్తుతం ఈ హోటల్స్ ద్వారా జీవనం పొందుతున్న ఎంతో మంది రోడ్డున పడ్డారు.

ఈ క్రమంలోనే అమెరికాలోని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ అమెరికన్ కాంగ్రెస్ కు బహిరంగ లేఖను రాసింది.

Telugu American Hotels, Coronaeffect-Telugu NRI

కరోనా కారణంగా అమెరికా వ్యాప్తంగా సుమారు 17శాతం హోటల్స్ మూతబడ్డాయని తెలిపింది.అంటే దాదాపు 1.10 లక్షల హోటల్స్ మూతబడ్డాయట.భవిష్యత్తులో మరో 10 వేల హోటల్స్ మూత బడటానికి సిద్దంగా ఉన్నాయని ఈ సమయంలో దెబ్బతిన్న హోటల్స్ ను ఆదుకోవడానికి ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వకపోతే వేలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని, హోటల్స్ యాజమాన్యాలుకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని, ప్రభుత్వం చొరవ చూపించి వెంటనే ఆర్ధిక సాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube