మరో సంచలనానికి తెరలేపిన ఓలా..!

ప్రపంచంలోనే భారీగా ఉద్యోగాలు కల్పిస్తూ, భారీగా ప్రజలకు సేవలందిస్తున్న రవాణా రంగం.అలాంటి రవాణా రంగంలో అతి పెద్ద క్యాబ్ సర్వీసెస్ ను అందిస్తున్న భారత్దేశం మొబిలిటి కంపెనీ ఓలా.

 Ola Opens For Another Sensation  Ola , New Features, New Updates, New Record, La-TeluguStop.com

క్యాబ్స్ సర్వీసెస్ ను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సాంకేతికతను పుచ్చుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న అతిపెద్ద క్యాప్స్ కంపెనీగా ఓలా నిలిచింది.

అయితే ఓలా కంపెనీ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది.

తాజాగా జియో స్పెషియల్ సర్వీస్ ప్రొవైడర్ జియోస్పోక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఒప్పందం ప్రకారం నెక్స్ట్ జనరేషన్ లొకేషన్ సాంకేతికతను ఓలా రూపొందించనుంది.

దీంతో రియల్ టైం, త్రీ డైమెన్షనల్, వెక్టార్ మ్యాప్స్ ను రూపొందించనున్నట్లు సమాచారం.విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో లివింగ్ మ్యాప్స్ ను అభివృద్ధి చేయడానికి ఓలా సన్నద్ధమైంది.

అందుకు సంబంధించిన ప్రయత్నాలను కూడా ఓలా ముమ్మరం చేస్తుంది.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఓలా, జియో స్పోక్ కంపెనీలు సంయుక్తంగా తీసుకురానున్న లోకేషన్ టెక్నాలజీ సాయంతో ప్రజల రవాణాకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వ్యక్తిగత వాహనాలలో మొబిలిటీ ని యాక్సెస్ చేయగల స్థిరమైన వ్యక్తిగతీకరించిన, సౌకర్యవంతంగా ఉండే లొకేషన్ టెక్నాలజీలను మరింత వేగవంతంగా అభివృద్ధి చేయడం కోసం జియో స్పోక్ ఓలాలో చేరినట్లు తెలుస్తోంది.లొకేషన్ జియో స్పెషియల్ టెక్నాలజీలు, అలాగే సాటిలైట్ ఇమేజరీ లో రియల్ టైం మ్యాప్స్ గా త్రీడీ, హెచ్డి, వెక్టార్ మ్యాపుల సాయంతో రవాణా రంగంలో భారీ మార్పులను తీసుకురానుంది.

Telugu Latest, Ups-Latest News - Telugu

ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.బహుళ మోడల్ రవాణా కోసం జియో స్పెషియల్ ఇంటెలిజెన్స్ ​ఖచ్చితంగా అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ లొకేషన్ టెక్నాలజీ సాయంతో త్రీ డైమెన్షనల్ మ్యాప్స్ ను రూపొందించడంతో డ్రోన్ వంటి ఏరియల్ మొబిలిటీ మోడల్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube