మూడేళ్లలో నాలుగు.. తారకా మజాకా!  

Ntr To Do Four Movies In Three Years - Telugu Koratala Siva, Ntr, Prashanth Neel, Rajamouli, Rrr, Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు.ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌డౌన్ తరువాత మిగతా షూటింగ్‌ను పూర్తి చేసుకోనుంది.

 Ntr To Do Four Movies In Three Years

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ చిత్రంగా రానున్న ఈ సినిమా షూటింగ్ కూడా అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

మూడేళ్లలో నాలుగు.. తారకా మజాకా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే తన నెక్ట్స్ చిత్రాలను కూడా క్యూలో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు తారక్.ఇప్పటికే సూపర్ హిట్ మూవీ కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇలా ఏకంగా నాలుగు సినిమాలను క్యూలో పెట్టాడు యంగ్ టైగర్.

అంటే రానున్న మూడేళ్లపాటు తారక్ డైరీలో ఖాళీ అనేది లేదనే చెప్పాలి.మరి తారక్‌కు ఈ సినిమాలు ఎలాంటి రికార్డులను తెచ్చిపెడతాయో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ntr To Do Four Movies In Three Years Related Telugu News,Photos/Pics,Images..