ఎన్టీఆర్ చాల సీరియస్ గా ఉండే వ్యక్తి.అయన చిన్న పిల్లలను కూడా గారు లేదా మీరు అని సంబోధిస్తారు.
అంతలా అయన అందరికి మర్యాద ఇచ్చేవారు.ఇక షూటింగ్ లొకేషన్ లో హీరోయిన్స్ అయినా లేదంటే ఆయనకంటే సీనియర్స్ ఉన్న కూడా ఎంతగానో గౌరవం ఇచ్చేవారు అన్నగారు.
ఇక ఎంత సీరియస్ గా నటిస్తారో కొన్ని సార్లు చిన్న పిల్లాడిలా జోష్ తో అల్లరి చేస్తూ కూడా ఉండేవారట.ఇక అయన ఎంతగానో ఆటపట్టించే ఒకే ఒక్క నటీమణి సూర్యకాంతం.
ఈ పేరు ఇప్పటి యువతకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ గయ్యాళి పాత్రల్లో ఆమె ఎంతో పేరు సంపాదించుకున్న సీనియర్ ఆర్టిస్ట్.ఇక ఆమె ఎంతో కష్టపడి సినిమాల్లో పైకి వచ్చారు.
చిన్నతనం నుంచి నటి కావాలని అనుకున్నారు.అందుకే స్టేజి షోస్ చేస్తూనే నాటికలో నటించేవారు.ఇక ఆమె నటించిన సత్య హారిశ్చంద్ర నాటకంలో సూర్యకాంతమ్మ నటనకు మెచ్చి దర్శకుడు సి పుల్లయ్య ఆమెకు మొదటి అవకాశం ఇచ్చారు.ఇక అక్కడ మొదలయిన సూర్యకాంతమ్మ నటన ప్రస్థానం వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎదిగింది.
సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆమె పేరును మార్చాలని దర్శకుడు అడిగితే అందుకే ఆమె నిరాకరించింది.ఈ విషయంలో పుల్లయ్య తో గొడవకు దిగింది.
మాములుగా సి పుల్లయ్య ఒక పెద్ద దర్శకుడు.అయన ఒక్క మాట చెప్తే కాదు అనే దైర్యం ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా చేయరు.
కానీ సూర్యకాంతమ్మ ఆయనతో గొడవ పడి తన పేరు మార్చకుండా పంతం పట్టి తన మాట నెగ్గించుకుంది.ఆలా ఆమెలో తొలినాళ్ళ నుంచి గయ్యాళి ఉండేది.అదే పేరు స్థిరస్థాయిగా నిలిచింది.ఇక అప్పట్లో బాగా రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఆమె ముందుండే వారు.హీరోయిన్స్ కి మించి ఆమె నెల జీతం ఉండేది.ఇక ఆమె నోరు పెద్దదయినట్టుగా చేతివాటం కూడా పెద్దదే.
ఆమె షూటింగ్ కి వస్తు వస్తు ఒక 50 మందికి సరిపడా భోజనాలతో లొకేషన్ లో అడుగుపెట్టేది.తానే స్వయం గా వండి అందరికి కొసరి కొసరి వండించేవారు.
ఆలా ఎన్టీఆర్ ఆమె వంటల కోసం ఎదురు చూసేవారు.ముద్దుగా కాంతమ్మత్త అంటూ పిలుస్తూ ఆమె భోజన లో ఏం కూరలు తెచ్చినదా అని ఎదురు చూసేవారు.
ఆలా ఎన్టీఆర్ కి కాంతమ్మత్త వంట అంటే ఎంతో అభిమానం.