ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.నిఖిల్( Nikhil Siddhartha ) నటించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తున్నాయి.
అయితే గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్ ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.
ఇకపోతే త్వరలోనే స్పై( Spy ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.ఎడిటర్ గ్యారీ బి.హెచ్( Garry BH ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అంతేకాకుండా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాని జూన్ 29న తెలుగుతో పాటూ హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
స్పై చిత్రం సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబందించిన థ్రిల్లర్ గా ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉంటే తాజా ఫిల్మ్ సర్కిల్స్ లో నిఖిల్ సినిమాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సపోర్ట్ ఉందని, ఫైనాన్సియల్ గా పూర్తి బ్యాకింగ్ ఉందని ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి.
రైట్ వింగ్ ఐడియాలజీ ని నిఖిల్ ప్రచారం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.అదే విధంగా తన సినిమాలు ప్రమోట్ చేసుకోవటానికి బీజేపీకు చెందిన అన్ని కనెక్షన్స్ ని వాడుతున్నాడని అంటున్నారు.
నార్త్ లో కార్తికేయ 2 ( Karthikeya 2 )హిట్ కావటానికి అదే కారణం అంటున్నారు.ఈ విషయంపై స్పందించడానికి ఆ విషయం గురించి మాట్లాడుతూ.
నేను ఏ రాజకీయ పార్టీకి సంభందించిన వాడిని కాదు.నేను ఎవరి ఎజెండా ను ముందుకు తీసుకెళ్లటం లేదు.
ఎవరి జెండాను మేము మా సినిమాల ద్వారా మోయటం లేదు.నేను శ్రీకృష్ణుడు భక్తుడుని అందుకే కార్తేకేయ 2 లో నటించారు.
అలాగే సుభాష్ చంద్ర బోస్ పాత్రను నేను చిన్నప్పుడు నా స్కూల్ కాంపిటేషన్స్ లో పోషించాను.అప్పటి నుంచి ఆయనంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు నిఖిల్.