sanమాజీ మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాల జిల్లాలోని పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు.నిన్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో భాగంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు అఖిలప్రియ అనుచరులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.అయితే అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.