గాడ్ ఫాదర్ షూటింగ్ అప్డేట్.. హైదరాబాద్ లో నయన్ సందడి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Nayanthara Spotted Leaving In Her Car Post Shoot Of Chiranjeevi's Godfather In H-TeluguStop.com

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అయితే ప్రసెంట్ చిరంజీవి కరోనా తో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అయినా కూడా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేయలేదు మేకర్స్.చిరంజీవి విశ్రాంతి లో ఉన్న నేపథ్యంలో చిరంజీవి సీన్స్ మినహాయించి మిగతా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నయనతార కూడా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

Telugu Chiranjeevi, Godfather, Hyderabad, Nayanthara, Nayantharacar-Movie

ఈ సినిమాలో నయన్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని వెళ్తూ హైదరాబాద్ లో కనిపించి సందడి చేసారు.పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈయన షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .బి .చౌదరి నిర్మిస్తున్నారు.

Telugu Chiranjeevi, Godfather, Hyderabad, Nayanthara, Nayantharacar-Movie

చిరంజీవి ఈ సినిమా కంటే ముందు ‘ఆచార్య‘ సినిమాలో నటించాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.ఈ సినిమాలతో పాటు చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా కూడా ప్రకటించాడు.

గాడ్ ఫాదర్ తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు చిరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube