గాడ్ ఫాదర్ షూటింగ్ అప్డేట్.. హైదరాబాద్ లో నయన్ సందడి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.

ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.

చిరంజీవి 153వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.అయితే ప్రసెంట్ చిరంజీవి కరోనా తో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

అయినా కూడా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేయలేదు మేకర్స్.చిరంజీవి విశ్రాంతి లో ఉన్న నేపథ్యంలో చిరంజీవి సీన్స్ మినహాయించి మిగతా సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నయనతార కూడా షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

"""/" / ఈ సినిమాలో నయన్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుని వెళ్తూ హైదరాబాద్ లో కనిపించి సందడి చేసారు.

పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈయన షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, ఆర్ .

బి .చౌదరి నిర్మిస్తున్నారు.

"""/" / చిరంజీవి ఈ సినిమా కంటే ముందు 'ఆచార్య' సినిమాలో నటించాడు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సిద్ద అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు.

ఈ సినిమాలతో పాటు చిరంజీవి 'భోళా శంకర్' సినిమా కూడా ప్రకటించాడు.గాడ్ ఫాదర్ తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు చిరు.

ఆ పని చేసినందుకు ఏకంగా 550 కోట్ల ఫైన్ కట్టిన విమాన సంస్థ…?