షాకింగ్‌ : వికలాంగుడిగా నాగార్జున

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున మరియు తమిళ యువ స్టార్‌ హీరో కార్తీలు కలిసి ఒక మల్టీస్టారర్‌ సినిమాలో నటించబోతున్న విషయం తెల్సిందే.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

 Nagarjuna In Handicapped Role-TeluguStop.com

ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయ్యింది.

త్వరలో ఈ సినిమా ప్రారంభం కాబోతుందనగా ఈ సినిమా గురించిన ఒక ఆశ్చర్యకర విషయం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది.అదే ఈ సినిమాలో నాగార్జున వికలాంగుడిగా కనిపించనున్నాడని.

ప్రస్తుతం ఈ వార్తలు ఫిల్మ్‌ నగర్‌లో హాట్‌ టాపిక్‌గా ఉన్నాయి.

‘ది ఇన్‌టచబుల్స్‌’ అనే ఫ్రెంచ్‌ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఆ కథలో ఒక ధనవంతుడైన వ్యక్తి అనారోగ్య కారణం చేత వీల్‌ చైర్‌కు పరిమితం అవుతాడు.ఆయన్ను చూసుకునేందుకు ఒక మగ నర్స్‌ను ఏర్పాటు చేసుకుంటాడు.

వారిద్దరి మధ్య సన్నిహితం ఏర్పడి, ఇద్దరి జీవితాలు కూడా మారిపోతాయి.ఈ కథలో ధనికుడిగా నాగార్జున మరియు నర్స్‌గా కార్తీ నటించే అవకాశముంది.

నాగార్జునను ప్రేక్షకులు అలా ఒప్పుకుంటారా అనేది కొంచెం అనుమానమే.అయితే దర్శకుడు కథను ప్రజెంట్‌ చేసే విధానాన్ని బట్టి సినిమా ఫలితం ఆధార పడి ఉంటుంది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు సెంటిమెంట్‌ల కలబోతగా ఈ సినిమా ఉండనుందని దర్శకుడు వంశీ పైడిపల్లి చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube