టీడీపీ అధినేత చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ముగిసింది.ఈ మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్ తో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కలిశారు.
తెలంగాణలో బీజేపీ, జనసేనతో పాటు టీడీపీ కలిసి వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 32 స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కాసాని జ్ఞానేశ్వర్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేయకపోయినా, టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో బరిలోకి దిగాలని కాసాని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 63 మంది అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేశారని తెలుస్తోంది.