కొత్త అవతారంలో మిస్టర్ కూల్..!

టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్‌ మహేంద్ర సింగ్ ధోనీ తన అద్భుతమైన ఆటతో, సారథ్యంతో ప్రపంచమంతటా అభిమానులను సంపాదించాడు.ఇప్పటికీ, ఎప్పటికీ ధోనీ లాంటి ఆటగాడు, కెప్టెన్ టీమిండియాకు దొరకరని అనడంలో అతిశయోక్తి లేదు.

 Ms Dhoni In New Look Ms Dhoni, New Look, Viral Latest, News Viral, Social-TeluguStop.com

ధోనీ మొన్నీమధ్య కూడా ఐపీఎల్ లో తన సత్తా చాటి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.మహి మళ్లీ ఆడితే చూడాలని ప్రస్తుతం అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

అయితే ఈసారి ఈ ఏడాది వేసవిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా ఫ్యాన్స్ ను ధోనీ అలరించునున్నాడు.అంతేకాదు ఒక గ్రాఫిక్ నవల ద్వారా కూడా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాడు ధోని.

తాజాగా సైంటిఫిక్ న్యూ ఏజ్ నవల్ లోని ధోనీకి సంబంధించిన లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.ఇందులో ధోనీ ‘అధర్వ’ అవతారంలో ఒక పోరాట యోధుడిలా కనిపించారు.

కింగ్ గెటప్‌లో కత్తి పట్టుకొని కండలు తిరిగిన బాడీ షో చేస్తూ ధోనీ చాలా అట్రాక్టివ్ గా కనిపించాడు.అంతే కాదు శత్రువులను చెందాడుతున్నట్లు కూడా ధోనీ కనిపించాడు.

ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.తమిళ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ తమిళ్‌మణి రూపొందిస్తున్న పీరియాడిక్ గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజిన్’ లో మెయిన్ లీడ్ లో ధోనీ నటిస్తున్నాడు.

అయితే ఇది గ్రాఫిక్ నవల కాబట్టి సాధారణ సినిమాలాగా ఇది ఉండకపోవచ్చని తెలుస్తోంది.తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.ఈ గ్రాఫిక్ నవల అమెజాన్‌ వెబ్సైట్ వేదికగా విక్రయానికి రావచ్చని సమాచారం.ఆసక్తిగల రీడర్లు ప్రీ-ఆర్డర్ చేసి అందరికంటే ముందే దీన్ని సొంతం చేసుకోవచ్చు.అయితే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ప్రాజెక్టుతో కలిసి పని చేస్తున్నందుకు తాను చాలా థ్రిల్లింగ్గా ఫీలవుతున్నానని ధోనీ చెప్పాడు.ఇది ఒక అద్భుతమైన వెంచర్ అని అభివర్ణించాడు.

ఉత్కంఠ రేపే కథ, కన్నార్పకుండా చూసే గ్రాఫిక్ నవలగా అధర్వ: ది ఆరిజిన్ ప్రజల ముందుకు వస్తుందని ఆయన వివరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube