ఎంపీ విజయ సాయిరెడ్డి కామెంట్స్… సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నమేంట్ ప్రారంభించాము.యువతలో ఉన్న ప్రతిభ బయటకు తీయడం కోసం వైఎస్సార్ కప్ పోటీలు ప్రారంభించాము.
ప్రతి ఏడాది ఈ పోటీలు జరుగుతాయి.గత ఏడాది 420 టీంలు పోటీల్లో పాల్గొన్నాయి.
ఈ సారి 490 టీంలు పాల్గొన్నాయి.విశాఖను క్రీడా రాజధానిగా చేయడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించిన రోజు ఈ పోటీలు ముగుస్తున్నాయి.జనవరి 9 వ తేదీకి రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ఎన్ని కష్టాలు ఎదురైన పట్టుదలతో పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు.ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
వచ్చే ఏడాది నుంచి మహిళకు వైఎస్ఆర్ కప్ పోటీలు పెడుతున్నాము.