తల్లిప్రేమ : లాక్‌ డౌన్‌ టైంలో బిడ్డ కోసం ఆమె సాగించిన సాహసయాత్రకు హ్యాట్సాఫ్‌

దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోయారు.ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకు వెళ్లవల్సిన వారు పూర్తిగా చిక్కుకు పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 Lockdown, Nellore, Mother, Son, Corona Effect-TeluguStop.com

కొందరు వందల కిలో మీటర్లు నడుస్తూ తమ ప్రాంతాలకు చేరుకున్న విషయం తెల్సిందే.ఈ సమయంలోనే కొందరు ఆకలితో మృతి చెందడం, నడిచి నడిచి అలసి పోయి చనిపోవడం వంటివి జరుగుతున్నాయి.

ఇంత జరుగుతున్నా కూడా ఒక తల్లి తన కొడుకు కోసం చేసిన ప్రయాణం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్‌ జిల్లా బోదన్‌కు చెందిన రజియా బేగం ఎస్జీటీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది.

ఆమెకు ముగ్గురు పిల్లలు.భర్త చనిపోవడంతో పిల్లలను ఆమె కంటికి రెప్పలా చూసుకుంటుంది.

కొడుకు మహ్మద్‌ నిజాముద్దీన్‌ హైదరాబాద్‌లో నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు.కొన్ని రోజుల క్రితం నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు బోదన్‌కు వచ్చాడు.

బోదన్‌ లో ఉన్న సమయంలో అతడి తండ్రికి అనారోగ్యం అంటూ ఫోన్‌ వచ్చింది.దాంతో నిజాముద్దీన్‌ కూడా స్నేహితుడితో కలిసి నెల్లూరుకు వెళ్లాడు.

Telugu Corona Effect, Lockdown, Mother, Nellore-Latest News - Telugu

నిజాముద్దీన్‌ నెల్లూరుకు వెళ్లిన రెండు రోజులకే లాక్‌ డౌన్‌ను ప్రకటించడంతో రాక పోకలు నిలిచి పోయాయి.నిజాముద్దీన్‌ అక్కడ నుండి వచ్చే వీలు లేకుండా పోయింది.ఈ సమయంలో నెల్లూరులో వైరస్‌ ప్రభలుతుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రజియా బేగంకు టెన్షన్‌ మొదలయ్యింది.తన కొడుకును ఎలాగైనా తీసుకు రావాలనే నిర్ణయానికి వచ్చింది.అనుకున్నదే తడువుగా తాను తన టూవీలర్‌పై వెళ్లి కొడుకును తీసుకు రావాలని నిర్ణయించుకుంది.

రూటు తెలియదు, అయినా కూడా గూగుల్‌ మ్యాప్స్‌ను వినియోగిచుకుని వెళ్లాలని భావించింది.

అయితే అడుగడుగున పోలీసులు ఉన్న ఈ సమయంలో ఎలా వేరే రాష్ట్రంకు వెళ్లాలి అనుకుంది.ఆమె బోదన్‌ ఏసీపీ ని కలిసి రిక్వెస్ట్‌ చేసింది.అతడు కష్టం అని చెప్పినా కూడా పర్మీషన్‌ తీసుకుంది.6వ తారీకున ఆమె జర్నీ ప్రారంభం అయ్యింది.7వ తారీకు మద్యాహ్నంకు నెల్లూరు చేరింది.ఆవెంటనే ఆమె అక్కడ నుండి జర్నీ ప్రారంభించింది.8వ తారీకు వరకు తన ఇంటికి చేరింది.
ఈ క్రమంలో ఆమె దాదాపుగా 1400 కిలో మీటర్ల మేరకు జర్నీ సాగించింది.

కేవలం 48 గంటల్లో టూ వీలర్‌పై అంత దూరం ప్రయాణించడం అంటే మామూలు విషయం కాదు.కొడుకుపై ఆమెకు ఉన్న ప్రేమ ఆ జర్నీని సాగించింది.ఒక మహిళ అయినా కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా బండి డ్రైవ్‌ చేసి ఆమె గమ్యం చేసుకున్న తీరును చూసి అంతా కూడా సెల్యూట్‌ చేస్తూ అమ్మా మీకు హ్యాట్సాప్‌ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube