హిందువుల నమ్మకం, కల అయినటువంటి అయోధ్య రామ మందిర ( Ram Mandir ) ఏర్పాట్లు పూర్తయిన సంగతి మనకు తెలిసిందే.ఈనెల 22వ తేదీ ఆయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.
ఇక ఈ వేడుకను కన్నులారా చూడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక అయోధ్య రామ మందిర ఏర్పాటు కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే రామ మందిరం ట్రస్ట్ వారు ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను కలిసి స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ వంటి వారందరికీ కూడా అయోధ్య ఆహ్వానం ( Invitation ) అందింది అయితే మోహన్ బాబును( Mohan Babu ) ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అన్న సందేహాలు కూడా అందరికీ కలిగాయి.ఈ క్రమంలోనే అయోధ్య ఆహ్వానం విషయంలో మోహన్ బాబు స్పందించారు తనకు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందిందని ఈయన తెలిపారు.
ఈ విధంగా మోహన్ బాబు స్పందిస్తూ తనకి కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందిందని అంతేకాకుండా తమ ఫ్యామిలీకి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా కల్పిస్తామని చెప్పారు.కానీ తాము భయపడి ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని మోహన్ బాబు తెలిపారు.ఇలా అయోధ్య వెళ్లకపోయినా ఇక్కడ దైవ సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అనేక పూజా కార్యక్రమాలను చేస్తున్నాము అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.