తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్న మిస్‌ శెట్టి...!

జాతిరత్నాలు సినిమా తో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్‌ పొలిశెట్టి చాలా గ్యాప్ తీసుకుని మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.అనుష్క కారణంగా ఈ సినిమా చాలా ఆలస్యం అయింది.

 Miss Shetty Mister Polishetty Trailer Talk Fans Trolls , Miss Shetty Mr Polish-TeluguStop.com

ఒక హిట్ సినిమా హీరో ఇంత గ్యాప్‌ తీసుకోవడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అంటూ అభిమానులు మరియు సినీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.సోషల్‌ మీడియాలో నవీన్ పొలిశెట్టి( Naveen Polishetty ) సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.

ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా విడుదలకు సిద్ధం అయింది.సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

Telugu Anushka Shetty, Jathiratnalu, Shetty, Telugu, Tollywood-Movie

సినిమా ప్రారంభం సమయంలోనే అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జోడీ ఏంటో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.వీరిద్దరి కాంబో విభిన్నంగా ఉంటుందని తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ అంతా భావించారు.అనుకున్నట్లుగానే పోస్టర్ లు మరియు టీజర్ ఉంది.అయితే ట్రైలర్ విడుదల తర్వాత కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.తెలుగు వారి అభిరుచికి ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో నవీన్ పొలిశెట్టి అభిమానులు ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నావు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Anushka Shetty, Jathiratnalu, Shetty, Telugu, Tollywood-Movie

అనుష్క( Anushka Shetty ) పాత్ర ను కొందరు విమర్శిస్తున్నారు.ప్రేమ పెళ్లి ఆసక్తి లేదు కానీ నవీన్ పొలిశెట్టి ద్వారా తల్లి కావాలని అనుకుంటుంది.కానీ నవీన్ మాత్రం ఒక మంచి భార్య కోసం చూస్తూ ఉంటాడు.ఇది స్టోరీ ఎక్కడో చూసినట్లుగా, విన్నట్లుగా రివర్స్ లో అనిపిస్తుంది.హీరో పెళ్లిపై ఆసక్తి లేదు, ప్రేమ అంటే ఇష్టం లేదు అంటూ డైలాగ్ లు చెప్పిన సినిమా లు తెలుగు లో వచ్చాయి.కానీ వాటిల్లో కొన్ని నిరాశ పరిచాయి.

మరి హీరోయిన్‌ అలాంటి పాత్ర పోషిస్తే తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తారా అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.కొత్తదనంతో కూడిన సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆధరిస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube