ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ.. హనుమాన్ మూవీ ఫ్యాన్స్ కు ఇది బంపర్ ఆఫర్ అంటూ?

అయితే రామ మందిరం ప్రారంభోత్సవం( Ayodhya Ram Mandir ) సందర్భంగా హనుమాన్ సినిమాను ప్రదర్శిస్తున్న మిరాజ్ థియేటర్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.తమ థియేటర్లలో హనుమాన్ సినిమా( Hanuman Movie )కు సంబంధించి ఒక టికెట్ కొంటే మరో టికెట్ పొందే అవకాశం కల్పించారు.

 Miraj Cinemas Bumper Offer To Hanuman Movie Fans Details Here,miraj Cinemas,hanu-TeluguStop.com

ఎంపిక చేసిన లొకేషన్లలో ప్రస్తుతం ఈ ఆఫర్ అమలవుతోందని తెలుస్తోంది. “MIRAJBOGO” అనే కోడ్ ను బుక్ మై షో యాప్ లేదా వెబ్ సైట్ లో ఎంటర్ చేసి టికెట్లు బుక్ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అయితే పరిమిత సంఖ్యలో థియేటర్లలో మాతమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుందని సమాచారం అందుతోంది.ఈ నెల 22వ తేదీన మాత్రమే ఈ ఆఫర్ అమలు కానుంది.మిరాజ్ సినిమాస్( Miraj Cinemas ) ప్రకటించిన ఈ ఆఫర్ వల్ల హనుమాన్ సినిమాకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.అయితే కొంతమంది నెటిజన్లు తాము నివశించే ప్రాంతంలో ఈ ఆఫర్ వర్క్ కావడం లేదని చెబుతున్నారు.

ఏయే థియేటర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందో మిరాజ్ సినిమాస్ ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మరోవైపు హనుమాన్ మూవీ ప్రస్తుతం ఇతర సంక్రాంతి సినిమాల కంటే బెటర్ కలెక్షన్లను సాధిస్తోంది.

తేజ సజ్జా, అమృతా అయ్యర్, ప్రశాంత్ వర్మలకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరోవైపు అయోధ్య రామ మందిరంలో రాముని విగ్రహం ప్రతిష్టాపన కోసం కొంత సమయం మాత్రమే ఉండగా భక్త జనంతో అయోధ్య నిండిపోయింది.1300 కోట్ల రూపాయల ఖర్చుతో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా( Hindu Temples ) ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.మూడు బాల రాముడి విగ్రహాలను తయారు చేయించగా అరుణ్ యోగిరాజ్( Arun Yogiraj ) అనే శిల్పి తయారు చేసిన బాల రాముని విగ్రహాన్ని ఓటింగ్ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగింది.

దిగువ అంతస్తులో బాలరాముడి విగ్రహంతో పాటు పురాతన విగ్రహ దర్శనభాగ్యాన్ని కల్పించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube