బెండ పంటను ఆశించే బూడిద తెగులను అరికట్టే పద్ధతులు..!

కూరగాయ పంటలలో ఒకటైన బెండకు మార్కెట్లో ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంటుంది.సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో అధిక దిగుబడి పొంది అధిక లాభాలు అర్జించవచ్చు.

 Methods To Prevent The Gray Rot, Which Is Expected To Harvest The Okra Crop , Ok-TeluguStop.com

బెండ సాగులో పాటించవలసిన సస్యరక్ష పద్ధతులు ఏమిటో.బెండకు తీవ్ర నష్టం కలిగించే తెగులను ఎలా అరికట్టాలో అనే విషయాలు తెలుసుకుందాం.

బెండ సాగు ( okra crop )చేయడానికి ఒండ్రు నేలలు, తేలికపాటి నల్ల రేగడి నేలలు, ఇసుక నేలలు, గరప నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.అయితే నేల యొక్క pH విలువ 6.8 వరకు ఉండే నేలలలో అధిక దిగుబడి సాధించవచ్చు.మార్కెట్లో ఎన్నో రకాల బెండ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

అందులో అర్క అనామిక, అర్క అభయ, పి7, పి8 లాంటి సాధారణ రకాలను సాగుకు ఎంపిక చేసుకోవచ్చు.ఒకవేళ హైబ్రిడ్ రకాలను సాగు చేయాలి అనుకుంటే విజయ, విశాల్, మహికో హైబ్రిడ్, సుప్రియ, తులసి లాంటి రకాలను ఎంపిక చేసుకుని ఐదు గ్రాముల ఇమిడా క్లోప్రిడ్( Imida Cloprid ), 10గ్రా ట్రైకో డెర్మా ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

Telugu Agriculture, Arka Abhaya, Arka Anamika, Cattle Manure, Imida Cloprid, Lat

పంట వేయడానికి ముందు భూమిని బాగా 3సార్లు కలియ దున్నాలి.ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు ( cattle manure )తో పాటు 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ ఎరువులు వేసి కలియ దున్నాలి.వాతావరణంలో ఉండే పరిస్థితులను బట్టి నీటి తడులు అందించాలి.పంట పూత, పిందె దశలో ఉన్నప్పుడు నీటి తడులు సమృద్ధిగా అందించాలి.

Telugu Agriculture, Arka Abhaya, Arka Anamika, Cattle Manure, Imida Cloprid, Lat

బెండ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో బూడిద తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగులు సోకితే ఆకులు పచ్చబడి రాలిపోతాయి.సకాలంలో ఈ తెగులను గుర్తించి అరికట్టకపోతే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సిందే.ఈ తెగులను గుర్తించి వెంటనే పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.ఆలస్యం చేయకుండా ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కరిగే గంధకపు పొడి వేసి పంటకు పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటర్ నీటిలో ఒక మిల్లీలీటరు డైనోకాప్ లేదా రెండు మిల్లీలీటర్ల హెక్సా కొనజోల్ కలిపి పిచికారి చేసి తొలి దశ లో అరికడితే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube