జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చా... మనోజ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక?

హీరో మంచు మనోజ్ (Manchu Manoj) ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈయన దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక(Mounika) రెడ్డిని వివాహం చేసుకున్నారు.

 Manoj Said That She Will Be With Him For The Rest Of His Life Mounika Who Shed T-TeluguStop.com

ఇలా వీరి వివాహం తర్వాత పలు దైవ దర్శనాలను చేసుకుంటూ ఉన్నారు అయితే మార్చి 19వ తేదీ మోహన్ బాబు(Mohan Babu) పుట్టినరోజు సందర్భంగా ఈయన మొదటిసారి తన భార్యతో కలిసి శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలకు వెళ్లారు.అక్కడ ఈ జంటకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.అయితే అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మనోజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా మనోజ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చివర్లో తన భార్య మౌనిక(Mounika) గురించి మాట్లాడటంతో ఆమె ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.నేను ప్రేమించిన అమ్మాయి స్వేచ్ఛగా ఉండాలి తన డ్రీమ్స్ వెతుక్కోవాలి.తాను ఏం చేయాలన్న నేను సపోర్ట్ ఇవ్వాలి.ప్రతి మగాడి గెలుపు వెనకాల ఆడది ఉంటుంది.అలాగే ఆడవారి విషయం వెనుక మగవాళ్ళు కూడా ఉండాలి అని ఈయన మాట్లాడారు.ఇలా మనోజ్(Manoj)మాట్లాడటంతో మౌనిక ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.

ఇక తన తండ్రి గురించి మాట్లాడుతూ తన తండ్రి తనకు అన్ కండిషనల్ లవ్ ఇచ్చారని తెలిపారు.నేను కొన్ని వందలసార్లు ఆయన్ని ఇబ్బంది పెట్టాను కానీ ఆయన నన్ను ఎప్పుడు ప్రేమగానే చూసుకున్నారు.నాన్న నేను ఒక అమ్మాయికి మాటిచ్చాను జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇచ్చానని తండ్రికి చెప్పగానే ఆయన వెంటనే నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాని చెప్పారు.ఇక మౌనిక తల్లిదండ్రులు లేరని మీ అందరికీ తెలుసు కానీ మా తండ్రి తను నా మూడో కూతురని అన్నారు.

ఎన్ని జన్మలెత్తినా నా తండ్రి రుణం తీర్చుకోలేను అంటూ ఈ సందర్భంగా మనోజ్ సైతం ఎమోషనల్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube