స్టార్ హీరోయిన్ రష్మిక( Rashmika ) డీప్ ఫేక్ వీడియో కొంతకాలం క్రితం నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఈ వీడియో వల్ల రష్మిక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
అయితే రష్మిక డీప్ ఫేక్( Rashmika Deep Fake ) వీడియోకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.రష్మిక డీప్ ఫేక్ వీడియోను తయారు చేసి వ్యక్తి ఏపీలోని గుంటూరుకు( Guntur ) చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
ఆ వ్యక్తి పేరు నవీన్( Naveen ) అని అతని వయస్సు 24 సంవత్సరాలు అని తెలుస్తోంది.
డీప్ ఫేక్ కేసులో నిందితుడు దొరకడం గురించి రష్మిక ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు.తెలుగులో ఎక్కువ సంఖ్యలో మూవీ ఆఫర్లు వస్తున్నా రష్మిక మాత్రం ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగే దిశగా అడుగులు వేస్తున్నారు.
రష్మిక రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.
రష్మిక నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటుండగా రష్మిక ప్రస్తుతం అభినయనికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు.నిందితుడి నుంచి మొబైల్, ల్యాప్ టాప్ తీసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మొబైల్ లో( Mobile ) డిలీట్ చేసిన డేట్ ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు ( Police ) చెప్పుకొచ్చారు.
రష్మిక పేరుతో నిందితుడికి ఫ్యాన్ పేజ్( Fan Page ) ఉందని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవాలనే ఆలోచనతోనే డీప్ ఫేక్ వీడియోను నిందితుడు తయారు చేశాడని తెలుస్తోంది.మరి కొందరు సినీ సెలబ్రిటీల పేర్లతో సైతం నిందితుడు ఫ్యాన్ పేజీలను నడుపుతున్నారని సమాచారం అందుతోంది.రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పుష్ప 2 సినిమాతో( Pushpa 2 ) రష్మిక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.