‘ఆనంద్’ మంచి కాఫీలాంటి సినిమా అంటూ వైవిధ్యభరిత ప్రచారం చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శేఖర్ కమ్ముల మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత ‘గోదావరి’, ‘లీడర్’, ‘హ్యాపీడేస్’ వంటి పలు సినిమాలతో ఈయన తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను ఏర్పాటు చేసుకున్నాడు.
న్యాచురల్ సినిమాలకు మారు పేరు అయిన శేఖర్ కమ్ముల తాజాగా మహేష్‌బాబుతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో మూవీని తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం వచ్చే సంవత్సరం ఉండే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.
రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరి కాంబోలో సినిమా రావాల్సి ఉంది.అయితే అప్పుడు మహేష్ బాబు ఇతర ప్రాజెక్ట్ వల్ల వీలు పడలేదు.
మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకు లైన్ క్లీయర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.
జులై 10 నుండి ‘బ్రహ్మోత్సవం’ ప్రారంభించనున్నాడు.ఈ సినిమాను డిసెంబర్లో పూర్తి చేసే అవకాశాలున్నాయి.
సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తాడని టాక్ వినిపిస్తుంది.
మరి మహేష్‌బాబుకు మంచి కాఫీలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఇస్తాడో చూడాలి.