"యాత్ర 2" సినిమా సెన్సార్ ఆపాలంటూ నిర్మాత నట్టి కుమార్ లేఖ..!!

మహి వి రాఘవ్ దర్శకత్వంలో “యాత్ర 2” సినిమా( Yatra 2 ) షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.వైయస్ జగన్( YS Jagan ) రాజకీయ జీవితానికి సంబంధించి తెరకెక్కుతోంది.

 Letter From Producer Natti Kumar To Stop Censoring Yatra 2 Details, Yatra 2, Na-TeluguStop.com

ఫిబ్రవరి 8వ తారీకు ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.ఈ క్రమంలో సినీ నిర్మాత నట్టి కుమార్( Producer Natti Kumar ) సీబీఎఫ్ సికీ లెటర్ రాశారు.“యాత్ర 2” సినిమాకి సెన్సార్ చేయొద్దని లేఖలో పేర్కొన్నారు.లోక్ సభ ఎన్నికల తర్వాతే ఈ సినిమా పూర్తి చేయాలని కోరారు.

జగన్ పాత్రలో ఈ సినిమాలో జీవా( Jiva ) నటిస్తున్నాడు.

2019 ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 8వ తారీకు విడుదల చేసిన “యాత్ర” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారం చేసుకుని “యాత్ర”( Yatra ) చిత్రీకరించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ పాదయాత్ర నేపథ్యంలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది.

ఈ క్రమంలో పాదయాత్ర అనుభవాలు ఇంకా రకరకాల విషయాలపై చిత్రీకరించిన “యాత్ర” విజయం సాధించింది.

వైయస్ పాత్రలో మమ్ముట్టి( Mammootty ) అందరిని మెప్పించడం జరిగింది.ఇప్పుడు ఆ సినిమాకి కొనసాగింపుగా “యాత్ర 2” రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఆల్రెడీ ఫిబ్రవరి 8వ తారీకు సినిమా విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

ఈ క్రమంలో ఇప్పటికే సినిమాకి సంబంధించి కొన్ని పోస్టర్స్ మరియు పాటలు విడుదల చేస్తూ ఉన్నారు.ఇక సెన్సార్ కి వెళుతున్న క్రమంలో “యాత్ర 2″కి సెన్సార్ చేయొద్దని నిర్మాత నట్టి కుమార్ లేఖ రాయడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube