33 మంది 'ఆ ఎన్నారై'...ల పాస్పోర్ట్ రద్దు..!

భార్యలని భారత్ లో వదిలేసి, విదేశాలు వెళిపోయి వారిని తమతో తీసుకెళ్ళకుండా మోసం చేస్తున్న ఘటనలని పరీక్షించి ఓ చట్టాన్ని ఇటీవల కేంద్రం రూపొందించింది.ఈ చట్టానికి అనుగుణంగా ఎన్నారైల భార్యల నుంచీ వచ్చిన ఫిర్యాదులని పరిగణలోకి తీసుకుని, విచారణ చేపట్టి.

 Law For Nri Husband Domestic-TeluguStop.com

ఆ తరువాత నేరం రుజువైతే ఆ ఎన్నారై లపై వేటు వేయడానికి చట్టాలని రూపొందించింది.ఈ తరుణంలోనే ఈ చట్టం

రూపకల్పన చేసిన తరువాత కేంద్రానికి ఇలాంటి ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడ్డాయి.దాంతో విచారణ చేపట్టిన కేంద్రం భార్యలని వదిలి వెళ్ళిపోయినా దాదాపు 33 మంది ప్రవాసీయుల పాస్‌పోర్టులను రద్దు చేసింది.8 మందిపై ఇంటర్‌పోల్‌ ద్వారా విదేశాంగ మంత్రిత్వ శాఖ లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఈ వివరాలని తాజాగా మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి బుధవారం తెలిపారు.ఎన్నారైల వివాహాలను వారంలో నమోదు చేయించాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించిందని.పరారిలో ఉండే ఎన్నారైలని వదిలే ప్రసక్తి లేదని ఇలాంటి కేసులు ఇంకా వస్తున్నాయని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube