అమెరికా తుఫాకి..ఏటా 40 వేలమంది బలి..!!

అమెరికాలో ప్రతీ ఏడాది దాదాపు కేవలం గన్ కల్చర్ కారణంగా 40 వేల మంది బలైపోతున్నారట.

ఈ షాకింగ్ న్యూస్ విని అమెరికా ప్రజలు సైతం నోళ్ళు వెళ్ళ బెడుతున్నారు.

అమెరికా వంటి అగ్ర రాజ్యంలో ఈ రకమైన గన్ కల్చర్ విధానంలో ఎందుకు మార్పులు తీసుకు రాలేక పోతోంది అమెరికా ప్రభుత్వం అంటూ ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

అయితే 2017 లో అమెరికాలో 40 వేలమంది తుఫాకులకి బలై పోయారు అనే విషయాన్ని “సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్” అంచనా వేసింది.1999 లో తూటాల ధాటికి 28,874 మంది మరణిస్తే.2017లో ఈ లెక్క రెట్టింపు అయ్యింది దాదాపు 39,773 మంది మరణించారు.అంటే అప్పటికీ ఇప్పటికీ పదివేలు తేడా అన్నమాట.

అయితే 2017లో తుపాకుల వల్ల మరణించినవారిలో 23,854 మంది కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న వారు కావడం గమనార్హం.

Advertisement

ఇదిలాఉంటే తుపాకీ వల్ల మరణించినవారిలో అత్యధికంగా తెల్లవారు కావడం గమనార్హం.తెల్లజాతివారే కావడం గమనార్హం.39,773 మందిలో 23,827 మంది వారే ఉన్నారని డిసీజ్ కంట్రోల్ తెలిపింది.అయితే అమెరికాలో తుపాకుల అమ్మకం సంతలో కూరలు అమ్మినంతగా జరుగుతుంది మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరణాలు సైతం అంతకి తగ్గట్టుగానే ఉంటాయి.

ఇప్పటికైనా ఈ విషయంలో అమెరికా చొరవ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు