ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన కన్నడ భామ కృతి శెట్టి.ఈ అమ్మడు మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకొని ఏకంగా మూడు సినిమాలని లైన్ లో పెట్టేసింది.
అందులో నేచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ స్టార్ రామ్, సుదీర్ బాబు సినిమాలు ఉన్నాయి.ఈ మూడు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.
వీటిలో నాని సినిమా శ్యామ్ సింగరాయ్ పాన్ ఇండియా రేంజ్ లో తెరక్కుతుంది.ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాలో కృతి శెట్టి యాక్టింగ్ టాలెంట్ ని మాత్రమే ప్రేక్షకులు చూశారు.
అలాగే ఆమె అందానికి ఫిదా అయ్యారు.అయితే అంతకు మించి ఆమెలో మంచి డాన్స్ టాలెంట్ కూడా ఉందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
డాన్స్ అంటే టాలీవుడ్ లో అందరూ కేవలం సాయి పల్లవిని మాత్రమే చూస్తున్నారు.అయితే సాయి పల్లవి రేంజ్ లో డాన్స్ చేయగలిగే కెపాసిటీ కృతి శెట్టిలో కూడా ఉందని ప్రూవ్ చేసుకుంది.
ఆమె స్వతహాగాక్లాసికల్ డాన్సర్ కావడంతో తన డాన్స్ టాలెంట్ ని చూపిస్తూ మహాశివరాత్రి రోజున ఒక వీడియో రిలీజ్ చేశారు.సుదీర్ బాబుతో ఆమె చేస్తున్న సినిమాకి సంబందించిన నిర్మాతలు ఈ వీడియోని యుట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ఈశ్వరా అంటూ సాగే ఈ సాంగ్ లో ఆమె క్లాసికల్ డాన్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది.క్లాసికల్ డాన్స్ అంటే ప్రధానంగా కావాల్సింది ముఖాభినయం.ఆ అభినయంలో కూడా కృతి శెట్టి మంచి మార్కులు కొట్టేసింది.మొత్తానికి టాలీవుడ్ లో డాన్సింగ్ క్వీన్ అయ్యే అన్ని అర్హతలు తనకి ఉన్నాయని ఈ వీడియో సాంగ్ తో ప్రూవ్ చేసుకుంది.
మరో కృతి శెట్టి తన డాన్స్ ని ప్రదర్శించే అవకాశం సినిమాలలో ఏ దర్శకుడు ఇస్తాడనేది వేచి చూడాలి.
.