ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓవర్ నైట్ లో సామాన్యులను సైతం పాపులర్ చేస్తోంది.“మీది 1000 అమ్మా.రెండు లివర్లు ఎక్స్ట్రా” అనే డైలాగ్ కుమారి ఆంటీ జీవితాన్ని, జాతకాన్ని మార్చేసింది.సెలబ్రిటీలు సైతం కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి క్యూ కడుతున్నారు. తెలంగాణ సీఎం సైతం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ టేస్ట్ చేస్తానని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.అయితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్( Kumari Aunty Food Stall ) దగ్గర ఫుడ్ నిజంగానే అంత టేస్టీగా ఉంటుందా? అంత రుచికరమైన భోజనం ఎక్కడా దొరకదా? అనే ప్రశ్నలకు మాత్రం బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన కీర్తి భట్ కాదనే సమాధానం చెబుతున్నారు.తన వుడ్ బి విజయ్ తో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో ఫుడ్ టేస్ట్ చేసిన కీర్తి భట్( Keerthy Bhatt ) ఈ కామెంట్లు చేశారు.కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ తెచ్చుకున్నామని అయితే ఆ ఫుడ్ తినలేకపోయామని ఆమె తెలిపారు.
ఆ ఫుడ్ స్టాల్ కు అంత హైప్ ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని విజయ్( Vijay ) కామెంట్లు చేశారు.నాన్ వెజ్ తీసుకుని తిన్నామని 170 రూపాయలు చెల్లించామని విజయ్ వెల్లడించారు.కుమారి ఆంటీ చాలా బిజీ అయిపోయారని ఉదయం ఒకసారి వచ్చి వెళ్లిపోతారని అక్కడి వాళ్లు చెబుతున్నారని విజయ్, కీర్తి అన్నారు.చికెన్ ఫ్రై, కర్రీ తీసుకున్నామని ఆ వంటకాలు చాలా స్పైసీగా ఉన్నాయని కీర్తి భట్ కామెంట్లు చేశారు.
నేను బెటర్ గా కుక్ చేస్తానని ఆమె వెల్లడించారు.
డిమాండ్ ఎక్కువ కావడంతో టేస్ట్ తగ్గిందేమో అంటూ కీర్తి భట్ సందేహాలను వ్యక్తం చేశారు.వైట్ రైస్, ఐదు ముక్కలు పెట్టారని విజయ్ అన్నారు.ఫుడ్ గురించి మా వ్యక్తిగత అభిప్రాయం చెప్పామని కీర్తి భట్, విజయ్ అన్నారు.
అయితే కుమారి ఆంటీ బిజినెస్( Kumari Aunty Business ) కు నష్టం కలిగేలా కీర్తి భట్ కామెంట్లు చేయడం రైట్ కాదని కొంతమంది చెబుతున్నారు.మరి కొందరు మాత్రం కీర్తి భట్, విజయ్ ఫుడ్ స్టాల్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు.