అమెరికాలో స్థిరపడిన కర్ణాటకకు ( karnataka )చెందిన ఎన్ఆర్ఐ తాను కొత్తగా కొనుగోలు చేసిన టెస్లా కారుకు ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నెంబర్ పొందారు.మూడు దశాబ్ధాల క్రితం తాను స్కూల్‌కు వెళ్లినప్పుడు ప్రయాణించిన బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్) బస్సు రిజిస్ట్రేషన్‌ను పోలిన నెంబర్ ప్లేట్‌ను సంపాదించారు.
తద్వారా ఆ రోజుల్లో బెంగళూరులోని విద్యారణ్యపుర- యశ్వంత్‌పురా మధ్య ఆ బస్సును నడిపిన రిటైర్డ్ బీఎంటీసీ డ్రైవర్ చెంగప్పను కూడా తాను గౌరవించుకున్నట్లేనని ఎన్ఆర్ఐ ధనపాల్ మంచేనహళ్లి జాతీయ మీడియా సంస్థకు తెలిపారు.
తాను 1992 నుంచి 1995 వరకు KA01F232 నెంబర్ గల బీఎంటీసీ బస్సు( BMTC bus )లో స్కూల్‌కు వెళ్లినట్లు ధనపాల్ తెలిపారు.తానే కాదు.ఎంతోమంది విద్యార్ధులు అప్పట్లో ఇదే బస్సులో ప్రయాణించారని ఆయన అన్నారు.
కానీ తన జీవితంతో ఆ బస్సుకు వున్న అనుబంధం ప్రత్యేకమైనదని.ఆ బస్సుతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి వున్నాయన్నారు.
ఆ బస్సును నడిపిన డ్రైవర్ చెంగప్ప.ఇప్పుడు రిటైర్ అయ్యారని ధనపాల్ తెలిపారు.
ఆయనకు గౌరవసూచికంగా, తన కొత్త టెస్లా కారుకు ఆ బస్సు నెంబర్‌ను పొందానని ధనపాల్ చెప్పారు.దశాబ్థాల పాటు కష్టపడి పనిచేసిన వ్యక్తులు తమకు స్పూర్తిగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
అలాగే బీఎంటీసీ బస్సుల పట్ల తనకున్న ప్రేమ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమన్నారు.చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లిన బస్సును, దానిని నడిపిన డ్రైవర్‌ను గుర్తుంచుకుని మరింత గౌరవం కల్పించిన ఎన్ఆర్ఐ ధనపాల్( Dhanapal )పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఆదర్శ్ హెగ్డే అనే ట్విట్టర్ యూజర్ ఈ సంగతులను పంచుకున్నాడు.తాను ప్రయాణించిన బస్సు, బస్సు డ్రైవర్ చెంగప్పలు చేసిన సేవకు ధనపాల్ తగిన రీతిలో గౌరవం కల్పించారని కొనియాడారు.
ఇది అందమైన కథ అన్న ఆయన.మానవ సంబంధాలే ఈ ప్రపంచంలో అంతిమంగా ముఖ్యమైనవన్నారు.