తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకరు.ప్రస్తుతం ఈయన సినిమాల పరంగా కాస్త ఇండస్ట్రీకి దూరమైన రాజకీయాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేసి ఎన్నికల హడావిడిలో ఉన్నారు.ప్రస్తుతం ఎన్నికల కారణంగా సినిమాలకు దూరమైనటువంటి ఈయన ఒకానొక సమయంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు కాస్త మిశ్రమ స్పందన వస్తుంది కానీ ఒకప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా(Pawan Kalyan Movie) అంటే అభిమానులు చెవి కోసుకునేవారు ఎంతో అద్భుతంగా ఈయన సినిమాలు ఉండేవి ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కు అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆయన సినిమాలే కారణమని చెప్పాలి.
ఇప్పటికీ ఈయన సినిమాలను తిరిగి విడుదల చేస్తే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి ఇలా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది.ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ (Tholiprema) సినిమాకు ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారనీ చెప్పాలి.
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనకు ఏమాత్రం సమయం విరామం దొరికిన పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాని చూస్తూ ఉంటారని తొలిప్రేమ సినిమా డైరెక్టర్ పలు సందర్భాలలో వెల్లడించారు.అదేవిధంగా మరొక స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కి కూడా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా అంటే చాలా ఇష్టమని ఆయన కుమార్తె శృతిహాసన్ ఒక సందర్భంలో తెలియజేశారు.
ఇటీవల రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శృతిహాసన్(Shruthi Hassan) పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.తొలిప్రేమ సినిమాని తన తండ్రి సుమారు ఒక వంద సార్ల వరకు చూసి ఉంటారని ఆ సినిమా అంటే నాన్నకు చాలా ఇష్టం అంటూ శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇలా పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా సెలబ్రిటీలు అభిమానులుగా మారిపోయారు అంటే ఈయన సినిమాలు ఎలా ఉంటాయో స్పష్టంగా అర్థమవుతుంది.