కోలీవుడ్ స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.ఈయన తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగు తున్నారు.
కోలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక అజిత్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అయ్యేవి.
దీంతో ఈయనకు ఇక్కడ కూడా కొద్దిగా మార్కెట్ అయితే ఏర్పడింది.పండుగ సీజన్స్ లో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం అయితే ఉంది.
ఇక తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘తునివు’ సినిమా తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది.అలాగే తమిళ్ లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.ఇలా తునివు సినిమా అజిత్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా తర్వాత అజిత్ తన కెరీర్ లో 62వ సినిమాను చేస్తున్నాడు.
ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఏదొక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నట్టు ప్రకటించారు.ముందుగా ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసారు.కానీ ఆ తర్వాత ఈయనను తప్పించి మగిళ్ తిరుమేని ని డైరెక్టర్ గా తీసుకున్నారు.
ఇటీవలే చెన్నైలో ఈ సినిమా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.
కాగా ఈ భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా ఎవరు నటించ బోతున్నారు అనే విషయంపై గత కొన్ని రోజులుగా పలు పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి.అయితే కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని మేకర్స్ ఆమెతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని.ఈమె అతి త్వరలోనే షూటింగ్ లో పాల్గొన బోతున్నట్టు చెబుతున్నారు.
మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ కాజల్ మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటుంది.