'భోళా శంకర్' సెట్స్ లో దర్శకేంద్రుడు.. వైరల్ అవుతున్న స్నాప్!

మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ ఇస్తున్నాడు.వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 K Raghavendra Rao Visits The Bholaa Shankar Sets Details, Bholaa Shankar, K Rag-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ సినిమాను బాబీ డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించారు.

చాలా ఏళ్ల తర్వాత పాత మెగాస్టార్ ను చూసిన ఫ్యాన్స్ చాలా సర్ప్రైజ్ అయ్యారు.ఇక ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.

Telugu Bhola Shankar, Bholaa Shankar, Chiranjeevi, Getup Srinu, Raghavendra Rao,

మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ స్నాప్ ను రిలీజ్ చేసారు.

Telugu Bhola Shankar, Bholaa Shankar, Chiranjeevi, Getup Srinu, Raghavendra Rao,

సోషల్ మీడియా వేదికగా ఒక పిక్ షేర్ చేసారు.భోళా శంకర్ షూట్ జరుగుతుండగా ఈ సెట్స్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు అడుగు పెట్టడం వైరల్ గా మారింది.ఈ పిక్ ను మేకర్స్ షేర్ చేసారు.

ఇందులో మెగాస్టార్ మ్యాన్లీ లుక్ తో ఆకట్టు కుంటుండగా.కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, శేఖర్ మాస్టర్, డైరెక్టర్ మెహర్ రమేష్, అనీ మాస్టర్ తదితరులు ఉన్నారు.

ఈ పిక్ నెట్టింట వైరల్ గా మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube