తెలుగులో పౌరాణిక చిత్రాలు అంటే ఖచ్చితంగా సీనియర్ ఎన్టీఆర్( Senior NTR ) గుర్తొస్తారు.ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో ఆయన ఒదిగిపోయారు.
ఇప్పటికీ ముఖ్యంగా శ్రీకృష్ణుడు రూపం అంటే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకు వస్తారు.అంతలా ఆయన తన ముద్ర వేశారు.
ఇక సినిమా షూటింగ్స్ సమయంలో ఆయన ఇలా మేకప్ వేసుకుని రాగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసేవారు.అంటే నిజంగా దేవుడే ఇలా దిగి వచ్చాడని అక్కడున్న వారంతా భావించే వారు.
ఇలా పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరుగా ఆయన మారారు.ఇక ప్రస్తు జనరేషన్‌లో ఇలా పౌరాణిక పాత్రలు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఆయన మనవడు తారక్ గుర్తొస్తాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా( RRR )తో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు.ఆ సినిమా తర్వాత మరో స్క్రిప్ట్ ఓకే చేయడానికి జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) చాలా సమయం తీసుకున్నాడు.చివరికి కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara ) చేస్తున్నాడు.ఇందులో అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.సినిమా థియేటర్లలో తెరపై హీరో కనిపించగానే ప్రేక్షకులు, అభిమానులు విజిల్స్ వేయడం సహజమే.
ఇందులో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చాలా ముందున్నారు.ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ విషయాల్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
ఇక పౌరాణిక పాత్రలు చేయాలంటే ఖచ్చితంగా అందుకు తగ్గ వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.డైలాగులు పలికించడంలో తన తాత సీనియర్ ఎన్టీఆర్‌ను ఆయన తలపిస్తారు.
ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో రకాల పాత్రలు చేశాడు.
అయితే ఆయనకు కూడా ఓ కోరిక ఉందట.సీనియర్ ఎన్టీఆర్ తరహాలో పౌరాణిక పాత్రలు చేయాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో తారక్ చెప్పాడు.అందులోనూ శ్రీకృష్ణుడు పాత్ర( Lord Sri Krishna Role ) చేయాలని ఆయన బలమైన కోరిక ఉంది.
ప్రస్తుతం రకరకాల స్క్రిప్ట్‌లను ఎన్టీఆర్ కోసం డైరెక్టర్లు తీసుకొస్తున్నారు.మరి ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడిన శ్రీకృష్ణుడి పాత్రతో కూడిన స్క్రిప్ట్ ఎవరు తీసుకొస్తారో అని అభిమానులు చూస్తున్నారు.
ఇప్పటికే పౌరాణిక సినిమాలు హీరోలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు.మరి సరైన స్క్రిప్ట్ ఎవరు తీసుకొచ్చినా దానికి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా న్యాయం చేస్తారు.ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం గ్యారంటీ.అలాంటి సినిమా కోసం అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు.