చీకట్లో జంక్షన్...డేంజర్లో జనం...నిర్లక్ష్యంలో హైవే అథారిటీ

నల్లగొండ జిల్లా: మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామంలో వద్ద అద్దంకి- నార్కట్ పల్లి హైవే పై జంక్షన్లో ఫెడ్ లైట్లు లేక సాయంత్రం అయితే చిమ్మ చీకట్లు కమ్ముకొని, పాదచారులు, వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని కుక్కడం గ్రామస్తులు,వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు.

జంక్షన్ వద్ద ఫెడ్ లైట్ పోల్ ధ్వంసమై సుమారు మూడు నెలలు దాటినా పట్టించుకున్న నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు( Miryalaguda DSP Rajasekhar Raju ) ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ప్రమాదాలను నివారించేందుకు హైవేపై, జంక్షన్ల వద్ద సూచిక బోర్డులను,సిగ్నల్ లైట్స్,ఫెడ్ లైట్లు ఏర్పాటు చేయాలని పలుమార్లు హైవే అథారిటీ ఇంజనీర్లకు,అధికారులకు సూచించినా డిఎస్పీ సూచనలను బేఖాతర్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.హైవేపై నిత్యం వందలాది వాహనాలు అతివేగంగా వెళ్తుండడంతో చీకటిలో రోడ్డు దాటాలంటే ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందోనని వణికిపోతున్నామనివాపోతున్నారు.

Junction In Darkness...people In Danger...highway Authority In Negligence, Junct

ఫెడ్ లైట్ పోల్ ను ఏర్పాటు చేయాలని గ్రామ కార్యదర్శికి,హైవే అథారిటీ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, గ్రామంలోని మెయిన్ జంక్షన్ కావడంతో గ్రామ ప్రజలు నిత్యవసర సరుకుల కొరకు రహదారిని పలుమార్లు దాటాల్సి వస్తుందని, హైవేపై,జంక్షన్ లో లైట్స్ లేక నరకం చూస్తున్నామని అంటున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నాతాధికారులు స్పందించి వెంటనే ఫెడ్ లైట్ ఫోల్ ఏర్పాటు చేసి, ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Advertisement

Latest Nalgonda News