కోర్టు ధిక్కరణ కేసులో ఉన్నతాధికారులకు జైలు శిక్ష..!

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.సర్వీస్ అంశాలపై గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయలేదని దాఖలైన ధిక్కరణ కేసులో ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

 Jail Sentence For High Officials In Contempt Of Court Case..!-TeluguStop.com

తీర్పు నేపథ్యంలో వెంటనే హైకోర్టుకు చేరుకున్న అధికారులు క్షమాపణ చెప్పారు.దీంతో తీర్పును సవరించిన ధర్మాసనం సాయంత్రం వరకు కోర్టులో నిలబడాలని ఆదేశించింది.ఐఏఎస్ అధికారి, ప్రస్తుత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రామకృష్ణలకు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది.ఈ క్రమంలోనే ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకోవాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.ఇరువురు గతంలో ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి కోర్టు తీర్పును అమలు చేయలేదని వారు అభియోగాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఈ కేసులో తాజాగా హైకోర్టు తీర్పును వెలువరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube