'జై భజరంగి' చిత్రం థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం :నిరంజన్ పన్సారి..

బాహుబలి కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో వస్తున్న మరో అద్భుత భారీ చిత్రం ‘జై భజరంగి 2’.‘కరుండా చక్రవర్తి‘ డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషలలో లో ఒకే సారి అక్టోబర్ 29న విడుదల అవుతుంది.కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’ 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృటించింది.ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2’ తెలుగులో ‘జై భజరంగి’ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో విడుదల అవుతుంది.

 'jai Bhajarangi' Is The Only Movie To Be Seen In Theaters: Niranjan Pansari, Jai-TeluguStop.com

ఈ సందర్భంగా ఈ రోజు అక్టోబర్ 23 న ఉదయం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రానికి సంభందించిన థియేట్రీకల్ ట్రైలర్ విడుదల చేసారు.ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, నిర్మాత, పంపిణి దారుడు కరుణాకర్ రెడ్డి, ప్రముఖ పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు పాల్గొన్నారు.

ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ – కన్నడ పరిశ్రమలో సూపర్ స్టార్ అయినా రాజ్ కుమార్ తనయుడు శివ రాజ్ కుమార్ గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం తో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు.తెలుగు లో రెండవ చిత్రంగా ఆయన నటించిన జై భజరంగి ట్రైలర్ ఇప్పుడు మీరే స్వయంగా చూసారు.

అది ఏ స్థాయిలో ఉందొ నేను చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి , కె జి ఎఫ్ రేంజ్ లో ఆ సినిమాల తరువాత మన సౌత్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది.చంద్రముఖి, అరుందతి, వంటి చిత్రాలలో వుండే థ్రిల్లింగ్ ఈ సినిమాలో వుంది.ఇందులో ఏ ఫ్రేమ్ చూసిన భారీతనం ఉట్టిపడుతుంది.ట్రైలర్ చూస్తుంటే పూర్తి సినిమా ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది.తప్పని సరిగా మన తెలుగు వారికి నచ్చే సినిమా అవుతుంది.” అన్నారు.

Telugu Bhavana Menon, Jai Bhajarang, Ott, Shivaraj Kumar, Telugu, Theater-Movie

జై భజరంగి తెలుగు వెర్షన్ నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ ఏడు నెలలక్రితం భజరంగి2 సినిమాకి సంబందించిన టీజర్ చూసాను.ఇంత భారీగా నిర్మించిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా తప్పని సరిగా ఆదరిస్తారని గ్రహించి, గత 30 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నా మా సంస్థ ‘శ్రీ బాలాజీ వీడియో‘ ఒక మంచి చిత్రంతో నిర్మాణ రంగం లోకి ఎంటర్ అవ్వాలనిజై భజరంగిహై క్వాలిటీ చిత్రంతో శ్రీకారం చుట్టాము.ఈ చిత్రం మున్ముందు కూడా ఓటిటి లో విడుదలకాదు.కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది.విజువల్ వండర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం ఇంట్లో చిన్ని తెర పై చుస్తే ఆ అనుభూతి పొందలేరు.మీరు ముందు యూట్యూబ్ ఛానల్ లో మూడు నిమిషాల థియేట్రీకల్ ట్రైలర్ చూడండి అది నచ్చితేనే సినిమా చూడండి.

అన్నారు.జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం లో ఇంకా నిర్మాత పంపిణీదారుడు కరుణాకర్ రెడ్డి, మరో పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు మాట్లాడారు.

Telugu Bhavana Menon, Jai Bhajarang, Ott, Shivaraj Kumar, Telugu, Theater-Movie

నటీనటులు: డా.శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే తదితరులు సాంకేతిక బృందం బ్యానర్: శ్రీ బాలాజీ వీడియో సంగీతం : అర్జున్ జన్య, సినిమాటోగ్రఫర్: స్వామి జె.గౌడ, ఎడిటర్: దీపు యస్ కుమార్, కాస్ట్యూమ్స్ :యోగి జి.రాజ్ ఫైట్స్:డా.రవి వర్మ, విక్రమ్ మోర్, ఆర్ట్ డైరెక్టర్: రవి శాంతే హక్కులూ, మాటలు :ఏ.సెల్వమ్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రేమ్ కుమార్, నిర్మాత: నిరంజన్ పన్సారి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ.హర్ష

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube