జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం..: మంత్రి కోమటిరెడ్డి

బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై( Jagadish Reddy ) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komatireddy Venkat Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిత్యం ప్రజల్లో ఉండే తనపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 Jagadish Reddy Is Sure To Go To Jail Minister Komati Reddy Details, Ex Minister-TeluguStop.com

తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న తనపై విమర్శలా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.అక్రమంగా మద్యం అమ్మి జైలుకెళ్లిన జగదీశ్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్లలో అక్రమాలు,

కరెంట్ కొనుగోళ్ల దోపిడీని బయట పెడుతున్నాననే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే జగదీశ్ రెడ్డికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.జగదీశ్ రెడ్డి అవినీతిపై విజిలెన్స్ మరియు సిట్టింగ్ జడ్జితో( Vigilance and Sitting Judge ) విచారణ జరిపిస్తామని తెలిపారు.ఇక జగదీశ్ రెడ్డి జైలుకు( Jail ) వెళ్లడం ఎవరూ ఆపలేరన్న ఆయన కేసీఆర్ ( KCR ) కుటుంబం తరువాత జైలుకెళ్లే రెండో వ్యక్తి జగదీశ్ రెడ్డేనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube