కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ ..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నోట్ల కట్టలు బయటపడ్డాయన్న ఆయన ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు కాంగ్రెస్ నేత అంబికాపతి నివాసంలోనివేనని తెలిపారు.

 It Is Not The Congress Party, It Is The Scamgress Party..: Minister Harish Rao-TeluguStop.com

తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని చెప్పారు.కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవల్ లో బలం లేదన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లలో అభ్యర్థులు కరువు అయ్యారని ఎద్దేవా చేశారు.అందుకే పక్క పార్టీల నుంచి వచ్చే వారి కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ కాదు అది స్కాంగ్రెస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు.తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తోందనుకోవడం పగటి కల అన్న మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ లో డబ్బు ఉన్న వాళ్లకే టికెట్లు ఇస్తారని తీవ్రంగా విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube