తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే( Mahatma Jyotirao Phule ) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) స్పందించారు.అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్లు పాలన కొనసాగించిందన్న ఆయన ఆ సమయంలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు.
పూలే తమకు ఆదర్శమన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ కు ప్రజాభవన్( Praja Bhavan ) అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు.అయితే నిన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసిన ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన సంగతి తెలిసిందే.