భారత్ అంతా రామనామంతో ఉర్రూతలూగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) అన్నారు.రాముని ఆగమనంతో కాలచక్రంలో మళ్లీ శుభగడియలు వస్తాయని తెలిపారు.
ఇక భవిష్యత్ అంతా శుభదినాలేనని ప్రధాని మోదీ పేర్కొన్నారు.అయోధ్య( Ayodhya ) ఘట్టం కోసం తాను పదకొండు రోజులు దీక్ష చేశానని చెప్పారు.
రాముడితో అనుబంధం ఉన్న అన్ని క్షేత్రాలను సందర్శించానన్నారు.

ఇవాళ దేశమంతా దీపావళి జరుపుకుంటోందని తెలిపారు.ఈ రాత్రికి ఇంటింటా దీపాలు వెలగాలని చెప్పారు.రామమందిరం( Ram Mandir ) భారత సమాజంలోని శాంతి, సామరస్యం పరస్పర అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
రామమందిరం సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఆశాకిరణమని తెలిపారు.రాముడు వివాదం కాదని ఒక సందేశమని స్పష్టం చేశారు.







