అవును.సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముని గుండె పూరీ జగన్నాథ విగ్రహంలో ఉంది.
కానీ అది ఎలా ఉంది? ఏ ఆకారంలో ఉంది? అనేది ఇంతవరకు ఎవరికీ తెలియని విషయం.అది ఆభరణాల రూపంలో ఉందా, లేక శిలాజ రూపంలో ఉందా అనేది ఎవరికీ అంతుచిక్కని రహస్యం.
అయితే శ్రీ కృష్ణుని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది అని ఎందుకంటారు.అసలు ఈ విషయం ఎక్కడ పుట్టింది అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
ఇక పూరి జగన్నాథ విగ్రహంలో శ్రీకృష్ణుడు గుండెకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది.కృష్ణుడు రాజ్య పాలన బాధ్యతలను విరమించుకుని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆయన పాదం బయటకు కనిపిస్తుంది.
అప్పుడే అటుగా వచ్చిన జరాసభరుడనే ఒక వేటగాడు లేడి కనులు అని పొరపాటు పడి, అటువైపు బాణం గురి పెట్టాడు.దాంతో కృష్ణుడు అక్కడే చనిపోతాడు.
అంతటితో తన భౌతిక దేహం వదిలి ఆ అవతారం చాలిస్తాడు.
అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు.
దేహం మొత్తం దహనం అవుతుంది కానీ, శ్రీకృష్ణుని గుండె మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంటుంది.పాండవులు ఆ గుండెను తీసి సముద్రంలో కలుపుతారు.
అటుగా వచ్చిన వేటగాడు ఆ గుండెను తీసుకుంటాడు అయితే అప్పటికే అది నీలి రంగు మారిపోయి ఉంటుంది. ఆ గుండెకు వేటగాడు ఒక గుహలో ఉంచి నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు.
దీంతో వేటగాళ్ల వారసులు నుంచి ఆ నీలిరంగు రాయిని తీసుకున్న రాజు ఆ నీలి రాయిని జగన్నాథ విగ్రహంలో పెట్టిస్తాడు.కాగా ప్రతి 8, 9, 12, 19 సంవత్సరాలకు ఒకసారి పూరీ జగన్నాథ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు.
అలాగే ఆ రాయిని కొత్త విగ్రహానికి అమరుస్తారు.ఈ కార్యం మొత్తం అర్ధరాత్రి జరగడం వల్ల దీన్ని ఎవరూ చూడరు.
ఈ కార్యం కొంత మంది అర్చకులు సన్నిధిలో, అది కూడా వారు కళ్ళకు గంతలు కట్టుకుని మార్చడం వల్ల ఎవరూ కూడా ఆ రాయిని చూడలేదు.అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందని కొందరు అంటూ ఉంటారు.
కానీ ఎవరు ఆ గుండెను ఇంత వరకు చూడలేదు.అందువల్ల సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని హృదయమే ఈ విగ్రహంలో ఉంటుందని అందరు నమ్ముతున్నారు.