ఏంటీ.. చిరు కూడా ఆ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడా... 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నటువంటి ఫేమ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.

 Megastar Chiranjeevi, Web Series News, Tollywood, Netflix, Amazon-TeluguStop.com

అందువల్ల సినీ పరిశ్రమకు వచ్చేటువంటి ఎంతో మంది నటీనటులకు చిరంజీవి ఆదర్శంగా నిలుస్తున్నారు.అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ ఓటిటి సంస్థ భారీ బడ్జెట్ తరహాలో నిర్మిస్తున్నట్లు ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ చిత్రానికి టాలీవుడ్ కి చెందినటువంటి ఓ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.

అయితే సినీ పరిశ్రమలో ఆ దర్శకుడుతో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే  మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు.ఐతే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

దీంతో చిరంజీవి వెబ్ సీరీస్ లో నటిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తల్లో ఎంతవరకూ నిజముందనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 45 శాతం చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం.

అయితే మరోపక్క చిరంజీవి మలయాళంలో విజయం సాధించినటువంటి “లూసిఫర్” అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ యంగ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube