పార్టీలోను, ప్రభుత్వంలోనూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్.( CM jagan )రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ టికెట్ల విషయంలో జగన్( CM ys jagan ) చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు.
సర్వే నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయింపుల విషయంలో జగన్ చాలా జాగ్రత్తగా తీసుకుంటూ భారీ ప్రక్షాళనకు తెర తీశారు. తనకు అత్యంత సన్నిహితులైన వారిని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు .అలాగే పనితీరు సక్రమంగా లేని వారిని తప్పిస్తున్నారు. మరి కొంతమందికి వేరే నియోజకవర్గంలో అవకాశం కల్పిస్తున్నారు.
ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యే అభ్యర్థులగాను , ఎమ్మెల్యేలకు ఎంపీ అభ్యర్థులుగా మార్పులు చేపట్టారు. అసలు ఈ స్థాయిలో మార్పు చేర్పులు చేయడం వెనుక జగన్ స్ట్రాటజీ ఏమిటనేది ఎవరికి అందు పట్టడం లేదు.
అసెంబ్లీ టికెట్ల విషయంలో ఇదంతా సర్వసాధారణమైనా, ఎంపీ అభ్యర్ధుల విషయంలో జగన్ ఇంతగా జాగ్రత్తలు తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఎవరికి అంతు పట్టడం లేదు. వాస్తవంగా జనాలు కూడా ఎంపీ అభ్యర్ధి ఎవరు అనేది పెద్దగా పట్టించుకోరు.క్రాస్ ఓటింగ్ ఎలాగూ జరిగే అవకాశం ఉండదు కాబట్టి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారికే ఎంపీ ఎన్నికల్లోను ఓటు వేసే అవకాశం ఉంటుంది.ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఎంపీ సీట్లు విషయంలో ఇంతగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు.
కానీ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంతగా జాగ్రత్తలు తీసుకోవడం ఎవరికి అందుబాటు లేదు .
ప్రస్తుత తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని తప్పించి సత్తి వేడు అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు.అక్కడ కోనేటి ఆదిమూలం ఇన్చార్జిగా నియమించారు చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ స్థానానికి పంపారు.చిత్తూరు పార్లమెంటుకు ప్రస్తుత మంత్రి నారాయణస్వామిని ( Minister Narayanaswamy )ఇన్చార్జిగా నియమించారు.
నెల్లూరు నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించి, ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమించారు .నరసరావుపేట లోక్ సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో యువ నాయకుడు నాగార్జున యాదవ్ ku టికెట్ ఇచ్చే విషయాన్ని జగన్ పరిశీలిస్తున్నారు. అలాగే మచిలీపట్నం ఎంపీ బాలసౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో , అక్కడ మరో అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు.ఇప్పటికే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నానిని జగన్ ప్రకటించారు.
ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ ను తప్పించి ఆయన స్థానంలో తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఇన్చార్జిగా నియమించారు .కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ ఇన్చార్జి నియమించారు.అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు, లేదా చలమలశెట్టి సునీల్ కుమార్ లలో ఒకరికి టికెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.అలాగే నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు స్థానంలో మరొకరిని పోటీకి దించేందుకు అభ్యర్దిని వెతుకుతున్నారు.
విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ స్థానంలో బొత్స ఝాన్సీ ని నియమించారు.అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ ఇన్చార్జిగా , మాజీమంత్రి శంకర నారాయణ ను అనంతపురం పార్లమెంటు ఇంచార్జిగా మార్పు చేశారు .హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో శాంతమ్మకు అవకాశం ఇచ్చారు.కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ను తప్పించి ఆయన స్థానంలో మంత్రి గుమ్మనూరు జయరాం నియమించారు.
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి స్థానంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియమించారు.ఇదే విధంగా మరికొన్ని స్థానాల్లో జగన్ మార్పు చేర్పులు చేపట్టారు.