అదనపు కట్నం కోసం ఐపీఎస్ ఆఫీసర్ పై కూడా వేధింపులు..

మహిళలు ఇప్పుడిప్పుడే స్వతంత్రంగా ఎదుగుతున్నారు.తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.

 Ips Officer Files Dowry Harassment Case Against Her Husband Ifs, Ips Officer,cri-TeluguStop.com

అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా దూసుకుపోతున్నారు.ఎంత చేసినా.

ఎన్ని సాధించినా అత్తింటి వేధింపులకు మాత్రం గురవ్వక తప్పడం లేదు.

తాజాగా జరిగిన ఒక సంఘటన అందరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.

ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని భర్తపై కేసు పెట్టింది.అయితే ఆ భర్త కూడా ఐఎఫ్ఎస్ అధికారి కావడం ఇక్కడ అందరిని ఆశ్చర్య పరుస్తున్న విషయం.

ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉండి కూడా భర్త ఇలాంటి నిర్వాకం చేయడంపై ఈ విషయం తెలిసినవారు అందరూ ఫిర్యాదు చేసి మంచి పని చేసిందని అంటున్నారు.సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా చదువుకోని వ్యక్తుల మధ్య తరచూ ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం.

అయితే బాగా చదువుకుని ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉండి కూడా భార్యను వేధించడం చాలా తప్పు.

Telugu Dowry, Ifs, Ips, Nithin Subhash, Uttar Pradesh-Latest News - Telugu

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.ఉత్తర ప్రదేశ్ కు చెందిన వర్తికా కటియార్ 2009 లో ఐపీఎస్ కు సెలక్టయ్యారు.ఆమె ప్రస్తుతం బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నారు.

వర్తికా కటియార్ 2011లో నితిన్ సుభాష్ అనే వ్యక్తితో వివాహం అయింది.ఆయన ఐఎఫ్ఎస్ అధికారి.

ఈయన ఢిల్లీలో పనిచేస్తున్నారు.

అయితే భార్యాభర్తల మధ్య కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

అయితే చాలా రోజులు భరించింది.ఇంక భరించలేక చివరకు బెంగళూరు కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది.

నా భర్త మద్యపానం, ధూమపానం వంటి చేదు అలవాట్లకు బానిసయ్యాడు.వీటికి దూరంగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పిన వినలేదు.2016లో ఈ విషయంపై మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

ఆ గొడవలో నాపై దాడి చేసి చెయ్యి విరగొట్టాడు.

గత సంవత్సరం దీపావళికి అత్తారింటి నుండి కానుక రాలేదంటూ గొడవ పడ్డాడు.విడాకులు ఇస్తానని బెదిరించాడు.

మా అమ్మమ్మ దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు.ఇల్లు కొంటానని నా తల్లిదండ్రుల దగ్గర 35 లక్షలు తీసుకున్నాడు.

ఇంకా అదనపు కట్నం కావాలని నన్ను వేధిస్తున్నాడు.అని వర్తికా కటియార్ భర్త నితిన్ తో సహా అతడి కుటుంబసభ్యులు మరో తొమ్మిది మందిపై ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube