పండిత పుత్ర పరమ శుంఠ అనే నానుడి కొన్ని సార్లు పనికి వస్తుందేమో కానీ ఎక్కువసార్లు గొప్ప తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు గొప్ప వారు అవుతారు.అందుకు ఉదాహరణ షబానా అజ్మీ.
కైఫీ అజ్మీ, షౌకత్ అజ్మీ వంటి గొప్ప తల్లిదండ్రులకు పుట్టింది షబానా.తండ్రి కవి అయితే తల్లి రంగస్థలంలో నటి గా పనిచేసింది.హైదరాబాద్ సంస్థానంలో ఆమె ఒక పౌరురాలు అని అంటూ ఉంటారు, అంతేకాదు అచ్చమైన హైదరాబాది కూడా.1930లో ఆమె హైదరాబాద్ లోనే ఉండేవారు.ఇక ఆమె పూర్వికులు ఖురాన్ ను ఉర్దూలోకి అనువదించారు.తండ్రి కైఫి అజ్మి కుటుంబమంతా కూడా కవుల కుటుంబం.
కైఫ్ అజ్మీ సోదరులంతా కూడా కవులుగానే జీవించారు.కళాకారుల కడుపున మంచి కళాకారునిగా షబానా జన్మించింది.ఇక ఆమె కెరియర్ కూడా మొదలైంది హైదరాబాదులోని.హైదరాబాదులో తిరుమల గిరి కి చెందిన బెనగల్ శ్యాంసుందర్ రావు అలియాస్ శ్యాం బెనెగల్ ఆమెను నటిని చేశారు.
శ్యామ్ బెనగల్ మరియు షబానా కలిసి ఎన్నో సినిమాల్లో పని చేశారు.వీరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉండేది.ఆయన తీసిన మొదటి సినిమా అయినటువంటి అంకుర్ లో షబానా లీడ్ రోల్ పోషించారు.
అంకుర్ చిత్రానికి గాను ఆమెకు జాతీయ అవార్డు కూడా లభించింది మరొక సినిమా మండీ.ఈ చిత్రంలో ఎంతో గొప్ప మంది నటీనటులు పనిచేశారు.ఇది ఒక వేశ్య గృహంలో జరిగే కథ.ఇందులో షబానా తో పాటు ఓం పురి, అమ్రిష్ పురి, స్మిత పాటిల్, నసీరుద్దీన్ షా కుల్ భూషణ్ కర్భంద వంటి వారు నటించారు.ఇందులో షబానా ఎంతో అందంగా ఉంటుంది.
పొడగాటి జుట్టు, చేతిలో పాన్, చారడేసి కళ్ళు అందమైన చీరలు.అన్ని వేసి ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తయారైంది.
వేశ్య గృహం నడిపే పెద్దగా షబానా కనిపించినా కూడా ఎక్కడ అసహ్యించుకోలేని రీతిలో సినిమా తీర్చిదిద్దబడింది.ఈ తరం వారు తప్పక చూడాల్సిన సినిమా అది.