లండన్‌లో( London ) గురువారం విడుదల చేసిన అధికారిక ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.గడిచిన ఏడాది కాలంలో యూకే జారీ చేసిన నైపుణ్యం కలిగిన వర్కర్, స్టూడెంట్ వీసా కేటగిరీల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారు.
నేషనల్ హెల్త్ సర్వీస్( National Health Service ) (ఎన్‌హెచ్ఎస్)లో సిబ్బంది కొరతను పూరించే లక్ష్యంతో ప్రత్యేకంగా లక్షిత ఆరోగ్య సంరక్షణ వీసాలతో పాటు క్రాస్ సెక్టార్ నైపుణ్యం కలిగిన పనిలో భారతీయులు అగ్రస్థానంలో వున్నారని యూకే హోం ఆఫీస్ సేకరించిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) డేటా చెబుతోంది.కొత్త గ్రాడ్యుయేట్ పోస్ట్ స్టడీ వర్క్ రూట్ కింద వీసాలు మంజూరైన అతిపెద్ద విద్యార్ధుల సమూహం కూడా భారతీయులే.
మొత్తం గ్రాంట్‌లలో వీరిది 41 శాతం వాటా.
అలాగే భారతీయులు( Indians ) వర్కర్ విభాగంలో మూడవ వంతు (33 శాతం) గ్రాంట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తూ వీసాల విషయంలోనూ అగ్రస్థానంలో నిలిచారు.‘‘స్కిల్డ్ వర్కర్’’, ‘‘ స్కిల్డ్ వర్కర్ – హెల్త్ అండ్ కేర్’’ రెండింటిలోనూ అత్యధిక వీసాలు పొందినది భారతీయులేనని యూకే హోం ఆఫీస్ తెలిపింది.మార్చి 2023తో ముగిసే సంవత్సరంలో మునుపటి విద్యార్ధులకు 92,951 గ్రాడ్యుయేట్ రూట్‌లు రెన్యువల్ అయ్యాయి.
అంతేకాదు.గ్రాడ్యుయేట్ రూట్‌లో ఉండటానికి సెలవు మంజూరు పొందిన అతిపెద్ద విద్యార్ధుల సమూహానికి భారతీయులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజా గణాంకాల ప్రకారం.భారతీయులకు మంజూరైన స్కిల్డ్ వర్కర్ వీసాలు( Skilled Worker Visas ) 63 శాతం పెరిగాయి.అవి 2021-22లో 13,390 వుండగా.2022-23 నాటికి 21,837కి పెరిగాయి.హెల్త్ కేర్ వీసా కేటగిరీలో భారతీయులకు 14,485 నుంచి 29,726కి (105 శాతం)పెరిగాయి.మార్చి 2023తో ముగిసే సంవత్సరంలో భారతీయ పౌరులకు 1,28,532 స్పాన్సర్డ్ స్టడీ వీసా గ్రాంట్లు వున్నాయి.
ఇవి మార్చి 2022తో ముగిసిన ఏడాదితో పోలిస్తే 53,429 (+63 శాతం) పెరుగుదల.మార్చి 2019తో ముగిసిన ఏడాది నుంచి భారతీయ విద్యార్ధులకు చదువుకోవడానికి గ్రాంట్లు గణనీయంగా పెరిగాయి.
అవి ఇప్పుడు ఏకంగా ఏడు రెట్లు ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి.అయితే విద్యార్ధి వీసా హోల్డర్లు డిపెండెంట్ కుటుంబ సభ్యులను తమ వెంట తీసుకురాకుండా ఆంక్షలు తీసుకొస్తున్నట్లు యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ ప్రకటించిన కొద్దిరోజులకే ఈ గణాంకాలు రావడం గమనార్హం.