భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర( Rachin Ravindra )కు అరుదైన గౌరవం దక్కింది.‘‘ outstanding male cricketer ’’ పురస్కారం ఆయనను వరించింది.బుధవారం క్రైస్ట్ చర్చ్‌లో జరిగిన ‘‘ న్యూజిలాండ్ క్రికెట్ అవార్డుల’’ కార్యక్రమంలో రచిన్ రవీంద్ర ఆ పురస్కారాన్ని అందుకున్నారు.24 ఏళ్ల రవీంద్ర సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.గతేడాది భారత్‌లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్( ICC World Cup 2023 ) సందర్భంగా రవీంద్ర మెరిశాడు.
అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్( England )తో జరిగిన మ్యాచ్‌లో 123 పరుగులు సహా ఆ టోర్నమెంట్లో 64 సగటుతో 578 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు వున్నాయి.తద్వారా ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగో స్థానంలో నిలిచాడు.
జనవరిలో ‘‘ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్( ICC Emerging Mens Player award ) ’’ టైటిల్ విజేతగా నిలిచాడు రచిన్ రవీంద్ర.బే ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో అతను అద్భుతమైన ఆట ఆడాడు.
ఈ సీజన్లో కివీస్ తరపున 14 టీ20 మ్యాచ్‌లు ఆడిన రచిన్ రవీంద్ర.స్కై స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 35 బంతుల్లో 68 పరుగులు చేశాడు.
కర్ణాటకకు చెందిన రవి కృష్ణమూర్తి కొన్నేళ్ల కిందట వ్యాపారం నిమిత్తం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.ఆయన కుమారుడు 21 ఏళ్ల రచిన్ రవీంద్ర తన ప్రతిభతో కివీస్ జట్టులో ప్లేస్ కొట్టేశాడు.ఇతనికి రాయలసీమ జిల్లా అయిన అనంతపురంతో విడదీయరాని అనుబంధం వుంది.2016లో అనంతపూర్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే స్పోర్ట్స్ అకాడమీకి తొలిసారి వచ్చాడు రవీంద్ర.ఇక్కడ శిక్షణ నచ్చడం, మెరుగైన మౌలిక వసతుల కారణంగా ఏటా సుమారు 3 నెలల పాటు ఈ కుర్రాడు న్యూజిలాండ్( New Zealand )కు చెందిన హట్హక్స్, వెల్లింగ్టన్ జట్ల తరపున వచ్చి ఆర్డీటీ స్టేడియంలో సాధన చేసేవాడు.క్రికెట్‌పై ప్రేమతో కేవలం శిక్షణ కోసమే అమ్మానాన్నలను వదిలి వేల కిలోమీటర్ల దూరంలోని అనంతపురం వచ్చేవాడు.
లెఫ్టార్మ్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా మంచి ప్రతిభ చూపిన రవీంద్ర….తొలుత బ్యాట్స్‌మన్.
అయితే బ్యాట్, బాల్‌తో నిలకడగా మంచి ప్రదర్శన చేసి అనతి కాలంలోనే న్యూజిలాండ్ అండర్-19, ‘ఎ’ జట్ల తరపున ప్రాతినిథ్యం వహించి సత్తా చాటాడు.