భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఇంజనీర్ నవ్‌జోత్ సాహ్నీకి( Navjot Sawhney ) ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.21వ శతాబ్ధపు ఐకాన్ అవార్డులు( 21st Century Icon Awards ) అందుకున్న 14 మందిలో ఆయన ఒకరిగా నిలిచారు.పేదలకు అందుబాటులో వుండే ధరలో వాషింగ్ మెషిన్ ప్రాజెక్ట్‌ను రూపొందించినందుకు గాను ‘‘ Sustainability Rising Star Award’’ను సాహ్నీ గెలుచుకున్నారు.శుక్రవారం జరిగిన కార్యక్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ (ఎల్‌ఎస్ఈజీ) సస్టైనబుల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ గ్రూప్ డైరెక్టర్ ఇబుకున్ అడెబాయో చేతుల మీదుగా సాహ్నీ అవార్డ్‌ను అందుకున్నారు.
వాషింగ్ మెషిన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి .ఆయనకు గతంలోనే బ్రిటీష్ ప్రైమ్ మినిస్టర్స్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుతో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
ఇక ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించి.పోటీల్లో పాల్గొన్న భారత సంతతికి చెందిన మహిళా ఫెన్సర్ సీఏ భవానీ దేవికి ‘‘Competitive Sports Award’’ దక్కింది.అలాగే భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలు అకోశ్ దుప్పటి, ధీరజ్ సిరిపురపులు కూడా అవార్డులకు ఎంపికయ్యారు.ఇతర విజేతల్లో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్‌కి స్పెషలిస్ట్ ప్రొఫెషనల్ అవార్డు, బ్యూటీ బ్రాండ్ ‘‘బ్యూటిఫెక్ట్’’ వ్యవస్ధాపకురాలు డాక్టర్ తారా లల్వానీకి సావీ లగ్జరీ అవార్డ్ వరించింది.దాదాపు 200 మంది బిజినెస్ లీడర్స్, ప్రముఖులు, క్రీడాకారులు, కమ్యూనిటీ ఛాంపియన్‌లు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.45 మంది ఫైనలిస్టుల్లో 14 మంది విజేతలను ఎంపిక చేశారు.లండన్ మాజీ లార్డ్ మేయర్ విన్సెంట్ కీవెనీ సహా వివిధ రంగాల ప్రముఖులతో ఏర్పాటైన జ్యూరీ విజేతలను ప్రకటించింది.
కాగా.నవజోత్ సాహ్నీ జీవితం స్పూర్తివంతం.నిరుపేదలకు తక్కువ ధరలో లభ్యమయ్యే వాషింగ్ మెషీన్‌లను ఆయన రూపొందించారు.
ఈ వాషింగ్ మెషిన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి నవజోత్ గతంలో మాట్లాడుతూ.ఇది అల్పాదాయ వర్గాలకు ప్రయోజనకరంగా వుంటుందన్నారు.
దీని ద్వారా 60 నుంచి 70 శాతం సమయంతో పాటు 50 శాతం నీటిని ఆదా అవుతుందని నవజోత్ చెప్పారు.ఈ వాషింగ్ మెషిన్‌ల ఆలోచన ఓ స్నేహం నుంచి పుట్టిందట.
గ్రామీణ దక్షిణ భారతదేశంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ రోజున దివ్య అనే మహిళను నవజోత్ కలిశారు.ఈ సందర్భంగా ప్రతిరోజూ మహిళలపై పడే భారాన్ని గుర్తించాడు.
యూకేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నవజోత్‌కు ఈ వాషింగ్ మెషీన్ల ఆలోచన వచ్చింది.