కెనడాలో దారుణం జరిగింది.భారత సంతతికి చెందిన బిల్డర్‌ను కన్స్ట్రక్షన్ సైట్లోనే దారుణంగా కాల్చిచంపారు.
వివరాల్లోకి.మృతుడిని బూటా సింగ్ గిల్‌గా( Buta Singh Gill ) గుర్తించారు.
పంజాబీ మూలాలున్న ఆయన ఎడ్మాంటన్‌లోని గురునానక్ సిక్కు దేవాలయం అధిపతి.అలాగే నగరంలోని విలాసవంతమైన గృహాలు నిర్మించే ‘‘గిల్ బిల్డ్ హోమ్స్ ’’ ( Gill Build Homes ) యజమాని.ఈ కాల్పుల ఘటనలో 49, 57 ఏళ్లు వున్న ఇద్దరు వ్యక్తులు మరణించగా.51 ఏళ్ల మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎడ్మంటన్ పోలీసులు తెలిపారు.గాయపడిన వ్యక్తిని సివిల్ ఇంజనీర్ సరబ్జీత్ సింగ్‌గా ( Sarabjeet Singh )గుర్తించారు.
కవానాగ్ 30 అవెన్యూ ప్రాంతాల వైపు రావొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.మంగళ, బుధవారాల్లో పోస్ట్‌మార్టం జరగనుంది.
నివేదికల ప్రకారం.నిర్మాణ స్థలంలో వాగ్వాదం జరిగింది.
ఇది గిల్ సహా మరోవ్యక్తిని భారత సంతతికి చెందిన నిర్మాణ కార్మికుడు కాల్చి చంపే పరిస్ధితికి దారితీసింది.అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
గిల్ గతంలో దోపిడీ కాల్స్, బెదిరింపులు అందుకున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనతో కెనడాలో( Canada ) స్థిరపడిన భారతీయ కమ్యూనిటీ ఉలిక్కిపడింది.
కాగా.గత నెలలో సిక్కు కీర్తన బృందంలో సభ్యుడైన 29 ఏళ్ల సంగీతకారుడిని అలబామా రాష్ట్రంలోని సెల్మా వద్ద గురుద్వారా వెలుపల కాల్చిచంపారు.మృతుడిని రాజ్ సింగ్, గోల్డీ( Raj Singh, Goldie ) అని కూడా పిలుస్తారు.ఆయన యూపీలోని బిజ్నోర్ జిల్లాలోని తండా సాహువాలా గ్రామానికి చెందివాడు.
ఆయన గడిచిన ఏడాదికి పైగా తన సంగీత బృందంతో అమెరికాలో వుంటున్నాడు.గోల్డీ గురుద్వారా బయట నిలబడి వుండగా.
గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపి పరారయ్యారు.రాజ్ సింగ్ మరణవార్తను కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
అయితే రాజ్ సింగ్ హత్య వెనుక జాతి విద్వేషం లేదని సెల్మా పోలీసులు తెలిపారు.