అమెరికా సెనేట్ బరిలో ఏపీ సంతతి మహిళ

అమెరికా చట్ట సభ బరిలో మరో భారత సంతతి అమెరికన్ మహిళ నిలిచారు.ఐవీ లీగ్ పాఠశాలలో ఆసియన్ల ప్రవేశంలో వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తిన మంగా అనంతత్ములా సెనేట్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు.

 Indian American Woman To Run For Us Congress From Virginia-TeluguStop.com

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన ఆమె ఇప్పటికే రక్షణ సంబంధిత కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు.సెనేట్ పోటీకి సంబంధించి మంగా ఇప్పటికే 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి రిపబ్లిక్ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు.

తద్వారా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు పోటీ చేస్తున్న మొదటి భారత సంతతి అభ్యర్ధిగా నిలిచారు.

Telugu American Senate, Hernadon, Indianamerican, Indian American, Varjiniya, Wa

డెమొక్రాట్లకు కంచుకోటగా పరిగణించే 11వ కాంగ్రెషనల్ జిల్లాలో ఎక్కువగా వాషింగ్టన్ డీసీ శివార్లలోని సంపన్న ఫెయిర్‌ఫాక్స్ కౌంటీలో ఉంది.ఇక్కడ సుమారు 17 శాతం ఆసియా జనాభా ఉండగా… 7 శాతం భారతీయ అమెరికన్లు ఉన్నారు.భారతీయ అమెరికన్లతో సహా ఆసియా అమెరికన్లు మొదటి నుంచి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధులకు మద్ధతు ఇస్తారు.

అయితే నవంబర్‌ కాంగ్రెషనల్ ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెస్ సభ్యుడు, ఆరుసార్లు విజేతగా నిలిచిన జెర్రీ కొన్నోలీని ఆమె ఢీకొట్టనున్నారు.ప్రస్తుత రాజకీయ పరిస్ధితులతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయవంతమైన విధానాల కారణంగా ఈసారి పెద్ద సంఖ్యలో డెమొక్రాటిక్ పార్టీ మద్ధతుదారులు రిపబ్లికన్ పార్టీ వైపు చూస్తున్నట్లు మంగ తెలిపారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి శనివారం వాషింగ్టన్ డీసీకి చెందిన వర్జీనియా శివారు ప్రాంతం హెర్న‌డొన్ నుంచి మంగా ప్రచారం ప్రారంభించారు.మంగ తన MANGAను ‘‘మేకింగ్ అమెరికన్స్ గ్రేట్ ఎగైన్‌’’గా పేర్కొన్నారు.

పన్నులు తగ్గించడం, మహిళలకు సమాన హక్కులు, చిన్న మధ్య తరహా వ్యాపారాభివృద్ధికి ప్రోత్సాహం, సరసమైన ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రతినిధుల సభకు ఎన్నికైతే భారత్-యూఎస్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మంగా హామీ ఇచ్చారు.

భారతదేశంలోని సంపన్నమైన జీవితాన్ని విడిచిపెట్టి.1990లలో తాను భర్త, కుమారుడితో కలిసి అమెరికాకు వచ్చినట్లు మంగ తెలిపారు.ఉత్తమ పాఠశాల వ్యవస్ధ, మెరుగైన జీవన ప్రమాణాల కారణంగా ఉత్తర వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్ కౌంటీని నివాసంగా ఎంచుకున్నట్లు మంగా వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఆమె చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించగా, ఆగ్రా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.……………….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube