కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ,రాబర్ట్ వాద్రా ల కుమారుడు రైహాన్ వాద్రా తొలిసారిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో గతేడాదే రైహన్ 18 వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం తో ఈ ఎన్నికల్లో తన తోలి ఓటు హక్కును వినియోగించుకున్నారు.తన తల్లి ప్రియాంక, తండ్రి రాబర్ట్ వాద్రాలతో కలసి ఆయన పోలింగ్ బూత్ కు వచ్చి మరీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోవైపు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైహాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.రైహాన్ ను చూసిన మీడియా మొత్తం కూడా ఆయనను చుట్టుముట్టింది.
ఈ సందర్భంగా రైహాన్ మాట్లాడుతూ, తన జీవితమంతా ఢిల్లీలోనే గడిచిందని ఈ నగరం మరింత అభివృద్ధి చెందాలని, ప్రపంచ అగ్రస్థాయి నగరాల సరసన ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపాడు.ప్రజల కోసం తాను ఓటు వేశానని, ప్రజా రవాణా వ్యవస్థ అందరికీ అందుబాటులోకి రావాలని, విద్యార్థులకు రాయితీలు కల్పించాలని కోరారు.