అమెరికా : డల్లాస్‌లో భారత సంతతి సీఈవోకి కీలక పదవి..!!

Indian-American CEO Arun Agarwal Named Chair Of Community Bond Task Force In Dallas, Dallas, CEO Arun Agarwal, Nextt, Mayor Johnson, Bond Task Force, Indian-American, Task Force

అమెరికాలో భారత సంతతికి చెందిన సీఈవో‌ అరుణ్ అగర్వాల్‌( CEO Arun Agarwal )కు కీలక పదవి దక్కింది.డల్లాస్ నగరానికి సంబంధించి 2024 క్యాపిటల్ బాండ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా కమ్యూనిటీ అండ్ టాస్క్‌ఫోర్స్ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు.అరుణ్ అగర్వాల్ ప్రస్తుతం డల్లాస్ కేంద్రంగా నడుస్తోన్న ‘Nextt’ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.2024 క్యాపిటల్ బాండ్ ప్రోగ్రామ్‌లో ప్రాజెక్ట్‌లను సమీక్షించడంలో, ఎంపిక చేయడంలో డల్లాస్ సిటీ కౌన్సిల్, సిటీ సిబ్బందికి సహాయం చేయడానికి 15 మందితో కూడిన సభ్యుల బృందం వుంటుంది.దీనికి అరుణ్ నేతృత్వం వహిస్తారు.బాండ్ ప్రోగ్రామ్‌లు నగర అవసరాల నిమిత్తం ఉద్దేశించబడ్డాయి.వీటిని తప్పనిసరిగా ఓటర్లు ఆమోదించాలి.

 Indian-american Ceo Arun Agarwal Named Chair Of Community Bond Task Force In Dal-TeluguStop.com

మరోవైపు.

తనకు దక్కిన గౌరవంపై అరుణ్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు.పార్కులు, ట్రయల్స్, వినోద సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టడంలో సహాయపడేందుకు తాను సిద్ధంగా వున్నట్లు తెలిపారు.

డల్లాస్ మేయర్ జాన్సన్( Mayor Johnson ) సురక్షితమైన , శక్తివంతమైన నగరాన్ని నిర్మించే ప్రయత్నాలకు నిజమైన ఛాంపియన్‌గా వున్నారని అరుణ్ ప్రశంసించారు.మేయర్ జాన్సన్, బాండ్ టాస్క్‌ఫోర్స్‌లోని తన సహోద్యోగులు, డల్లాస్ ప్రజలతో కలిసి నగర అవసరాలకు ప్రాధాన్యతనిస్తూనే పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు అరుణ్ అన్నారు.

Telugu Bond Task Force, Dallas, Indian American, Mayor Johnson, Nextt, Task Forc

రాబోయే బాండ్ ప్రోగ్రామ్.ప్రజల భద్రత, మౌలిక సదుపాయాలు, ముఖ్యమైన అవసరాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి కీలకమైన అవకాశాన్ని అందిస్తుందని డల్లాస్ మేయర్ ఎరిక్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.అరుణ్ మన నగరంలో సమర్ధుడిగా నిరూపించుకున్నారని.ఈ టాస్క్‌ఫోర్స్‌లో డల్లాస్ ప్రజలకు సరైన ప్రాధాన్యతల కోసం ఆయన నిలబడతాడని జాన్సన్ ఆకాంక్షించారు.

Telugu Bond Task Force, Dallas, Indian American, Mayor Johnson, Nextt, Task Forc

ఇదిలావుండగా.బాండ్ ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్ కింద డల్లాస్ నగరానికి 13.5 బిలియన్ డాలర్ల అవసరాల జాబితాను అంచనా వేస్తుంది.అనంతరం డల్లాస్ సిటీ కౌన్సిల్‌కు 1 బిలియన్ డాలర్లను సిఫార్సు చేస్తుంది.

అరుణ్ అగర్వాల్ నియామకం ద్వారా బాండ్ ప్రోగ్రామ్‌లో పార్కులకు అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు నొక్కి చెబుతుందని మేయర్ పేర్కొన్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube